రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. తనకున్న 13 గుంటల భూమిని తెరాస ప్రభుత్వం లాక్కోవడం వల్లే ఆ రైతు మరణించారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు స్థిరాస్తి వ్యాపారంతో సంబంధాలు ఉన్నట్లు తనకు సమాచారం ఉందని ఆరోపించారు.
రైతు మరణించించిన తరువాత ఎకరా భూమి ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు ప్రకటన చేయడం ఏమిటని ప్రశ్నించారు. అదేదో ముందే ఇచ్చేస్తే... ఆ రైతు బతికుండేవాడు కదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై ప్రతిరోజు ఏదో ఓ చోట హింసాకాండ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న ఘటనలపై గవర్నర్‌ను... జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలవడంతో పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని ఉత్తమ్‌కుమార్ స్పష్టం చేశారు.