ETV Bharat / state

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కృషి చేస్తా: ఉత్తమ్ - tpcc chief uttham latest news

నాడు న్యాయవాదులు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో.. నేడు వారికే రక్షణ కరువైందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పార్లమెంటులో బిల్లును తీసుకురావడానికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్​లో నిర్వహించిన న్యాయవాదుల ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

tpcc-chief-utham-mlc-elections-campaigning
న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కృషి చేస్తా: ఉత్తమ్
author img

By

Published : Mar 9, 2021, 6:23 PM IST

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పార్లమెంటులో బిల్లును తీసుకురావడానికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వామన్​రావు, నాగమణి దంపతుల హత్యలను ఖండిస్తూ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్​లో నిర్వహించిన న్యాయవాదుల ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

అధికారంలో ఉన్నవారే వామన్​రావు దంపతులను హత్య చేశారని ఉత్తమ్​ ఆరోపించారు. ఎవరి అండదండలతో నడిరోడ్డుపైనే అంతటి ఘాతుకానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చన్నారు. నాడు న్యాయవాదులు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో.. నేడు వారికే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని న్యాయవాదులు గ్రహించాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

న్యాయవాద దంపతుల హత్యను ముఖ్యమంత్రి ఖండించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న దోపిడీకి ఎదురుతిరిగితే.. చంపేస్తూ రౌడీ రాజ్యం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. హత్య చేసిన వారికి బుద్ధి చెప్పే సమయం ఎమ్మెల్సీ ఎన్నికలే అని, న్యాయవాదులు న్యాయంగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు న్యాయవాదులు చేపట్టిన ఈ ధర్నాకు కాంగ్రెస్​, భాజపా, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

ఇదీ చూడండి: కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: డీకే అరుణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.