వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత దృష్ట్యా అరెస్ట్ అయిన రేవంత్‌ను అంబర్పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపు ఉంచి.. అనంతరం విడుదల చేశారు. ఠాణా నుంచి బయటకు వచ్చినప్పుడు రేవంత్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.
'మీది చంద్రబాబు కొడుకుల కంపెనీ.. దానికి సీఈవో రేవంత్‌రెడ్డి' అని షర్మిల కామెంట్ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా..
దీనిపై రేవంత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. అన్న మీద కోపం మా మీద ఎందుకు చూపించాలంటూ ఎద్దేవా చేశారు.
'నేను ఎన్జీవో ఆర్గనైజేషన్ల గురించి మాట్లాడదలచుకోలే.. రాజకీయ పార్టీలు, నేతలు ఎవరైనా మాట్లాడితే స్పందిస్తా. రాజశేఖర్‌రెడ్డి బిడ్డ దుఃఖంలో ఉన్నది.. కుటుంబంలో సమస్యలు.. అన్న ఆదరణ కరవైంది.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. అన్న మీద కోపం ఉంటే మా మీద ఎందుకు చూపించాలి. ఆమె ఏం మాట్లాడినా.. మేం సీరియస్‌గా తీసుకోవడం లేదు. మీరు కూడా అదే చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుంది'.
- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీచూడండి: REVANTH: కోకాపేట భూబాగోతం వివరాలు రేపు బయటపెడతా : రేవంత్ రెడ్డి