ETV Bharat / state

భాజపా కుట్రలను వివరిస్తున్నందుకు ఆ పత్రికపై కేసు: రేవంత్‌రెడ్డి - TPCC Chief Revanth Reddy fires on bjp

Revanth reddy on bjp: భాజపా తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే భాజపా కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌... భాజపాపై తనదైన శైలిలో ఫైర్‌ అయ్యారు.

TPCC Chief Revanth Reddy on Bjp
TPCC Chief Revanth Reddy on Bjp
author img

By

Published : Jun 13, 2022, 5:30 PM IST

Updated : Jun 13, 2022, 6:29 PM IST

భాజపా కుట్రలను వివరిస్తున్నందుకు ఆ పత్రికపై కేసు: రేవంత్‌రెడ్డి

Revanth reddy on bjp: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలపడుతుందనే భయంతో భాజపా కుట్రలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు లేకుండానే సోనియా, రాహుల్‌ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని.. మండిపడ్డారు. రాహుల్‌గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం తప్పు చేసిందంటే ప్రజలు నమ్మరని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరా గాంధీని 1979లో జైలుకు పంపిస్తే దేశం మొత్తం మద్దతుగా నిలిచి 1980లో కాంగ్రెస్‌ను గెలిపించారని వివరించారు. 2024లో మళ్లీ అదే రిపీట్‌ కాబోతుందన్నారు. ఈడీ, సీబీఐలు గాంధీ కుటుంబాన్ని ఏం చేయలేవన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్​లో సుప్రీంకోర్టు కూడా ఎటువంటి అవకతవకలు జరగలేవని తేల్చిందని... దానితో పాటు 2017లో ఈడీ కూడా అవకతవకలు లేవని తేల్చిందని తెలిపారు.

''1937లో నెహ్రూ నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను స్థాపించారు. సర్దార్‌ పటేల్‌ కూడా నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఏర్పాటులో భాగం పంచుకున్నారు. స్వాంతంత్య్రోద్యమంలో ప్రజల్లో ఐక్యత పెంచేందుకే నేషనల్‌ హెరాల్డ్ స్థాపించారు. నెహ్రూ కుటుంబం ఎన్నో నష్టాలకు ఓర్చి నేషనల్‌ హెరాల్డ్ పత్రికను నడిపించింది. పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ రూ.90 కోట్లు ఇచ్చి ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. భాజపా కుట్రలను వివరిస్తున్నందుకు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికపై కేసు వేయించారు. నేషనల్‌ హెరాల్డ్‌లో ఎలాంటి నగదు బదిలీ జరగలేదని ఈడీ 2017లోనే తేల్చింది. భాజపా పాలనలో పేదల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. మోదీ సర్కార్‌ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోంది.'' -రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి :

Last Updated : Jun 13, 2022, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.