చలో రాజ్‌భవన్ పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో పోలీసుల అత్యుత్సాహం వల్లే ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గాయపడ్డారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బల్మూరి వెంకట్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్‌తో కలిసి రేవంత్ నారాయణగూడలోని ఆయన నివాసంలో వెంకట్‌ను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై డీజీపీ, మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పౌరులు, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నారన్నారు. బల్మూరి వెంకట్‌ను పోలీసులు టార్గెట్ చేసి పక్కటెముకలు విరిగేలా బలంగా కొట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో వెంకట్ చురుగ్గా పాల్గొంటునందుకే పోలీసులు దాడి చేసి వెంకట్‌ను గాయపరిచినట్లు రేవంత్ వెల్లడించారు.
కావాలనే నాపై దాడి చేశారు. నా పక్కటెముక చిట్లిందని వైద్యులు తెలిపారు. ఇందిరా పార్కు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నా కావాలనే అక్కడున్న కొంత మంది పోలీసులు నాపై దాడి చేశారు. మేం చేసిన తప్పు ఏమిటి..?
-బల్మూరి వెంకట్, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: CM KCR Phone Call: హుజూరాబాద్‌పై కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఆడియో వైరల్