ETV Bharat / state

YSR: దివంగత సీఎం వైఎస్​ఆర్​కు రేవంత్​రెడ్డి నివాళి - ysr vardhanthi news

మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ సహా ఇతర కాంగ్రెస్​ నేతలు గాంధీ భవన్​లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వైఎస్​ కుమార్తె, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల పంజాగుట్టలోని రాజశేఖర్​రెడ్డి విగ్రహం వద్ద నివాళి అర్పించారు.

REVANTH REDDY
REVANTH REDDY
author img

By

Published : Sep 2, 2021, 4:28 PM IST

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్​ రాజశేఖర్​రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా.. గాంధీ భవన్​లో ఆయన చిత్రపటానికి.. పలువురు కాంగ్రెస్​ నేతలు నివాళి అర్పించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రాంచందర్​​రావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మండలి మాజీ విపక్ష సభ్యులు షబ్బీల్​ అలీ, సీనియర్​ ఉపాధ్యక్షులు నిరంజన్​, మహిళ కాంగ్రెస్​ అధ్యక్షురాలు సునీతరావు సహా ఇతర నేతలు వైఎస్​ఆర్​ సేవలను స్మరించుకున్నారు. పంజాగుట్ట సెంటర్​లో ఉన్న రాజశేఖర్​రెడ్డి విగ్రహం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళి అర్పించారు.

పంజాగుట్టలో షర్మిల నివాళి..

వైఎస్​ఆర్​ 12 వ వర్ధంతి సందర్భంగా.. ఆయన తనయ, వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘనంగా నివాళి అర్పించారు. పంజాగుట్ట కూడలిలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువులు నేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో వైఎస్‌ఆర్ చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు.

ఇదీచూడండి: YSR: నేడు వైఎస్ సంస్మరణ సభ... సన్నిహితులను ఆహ్వానించిన విజయమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.