ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్ @7AM - top ten telugu news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
టాప్​టెన్​ న్యూస్ @7AM
author img

By

Published : Feb 17, 2022, 6:59 AM IST

  • మహా జాతరలో నేడు సమ్మక్క ఆగమనం

మేడారం జాతరలో తొలి ఘట్టం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శివసత్తుల పూనకాలు, ఆదివాసీల ఆచారాలతో నిండు పున్నమి వేళ బుధవారం రాత్రి 10.47 గంటలకు సారలమ్మ తల్లి గద్దెపై కొలువైన ఘట్టం కనుల పండువగా సాగింది. జంపన్నవాగు భక్త జనసంద్రమైంది.

  • సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా తెరాస శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. మూడు రోజులుగా వేడుకలు జరుపుకుంటున్న గులాబీ కార్యకర్తలు.. సంబురాలతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గులాబీ దళపతి పుట్టినరోజు పురస్కరించుకుని రైతుబంధు సమితి ఇవాళ తెలంగాణ రైతు దినోత్సవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసింది.

  • నేడు ఉపసంఘం సమావేశం

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉప కమిటీ నేడు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా భేటీ జరగనుంది.

  • కండ్లకోయ ఐటీ పార్కుకు నేడు శంకుస్థాపన

foundation stone to Kandlakoya IT Park: మేడ్చల్​ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కండ్లకోయ కూడలికి సమీపంలో వచ్చే ఈ ఐటీ పార్కును 10 ఎకరాల్లో టీఎస్​ఐఐసీ అభివృద్ధి చేయనుంది.

  • ఆ రాష్ట్రంలో 100 శాతం పంపిణీ పూర్తి

Vaccination: కరోనా టీకాల కార్యక్రమంలో గోవా 100 శాతం లక్ష్యం చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర జనాభాలో అర్హులైన 11.66 మందికీ రెండు డోసుల టీకా వేసినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.

  • కొవిడ్​ ఆంక్షలను ఎత్తేస్తున్న రాష్ట్రాలు

Covid Restrictions: భారత్​లో కరోనా రోజూవారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో అన్ని రకాల కొవిడ్ నిబంధనలను ఎత్తివేసింది అక్కడి సర్కారు. ఉత్తరాఖండ్​ కూడా ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకునేందుకు అనుమతించింది.

  • హెచ్​ఐవీ నుంచి మహిళకు విముక్తి!

Woman Cured of HIV: మూలకణ మార్పిడి చికిత్సతో ఓ మహిళ హెచ్​ఐవీ నుంచి విముక్తి పొందారు. ఇలా స్వస్థత పొందిన తొలి మహిళ ఆమెనే కావడం విశేషం. ఇంతకీ ఇది ఎలా సాధ్యపడిందంటే?

  • అగ్రస్థానంలో ఎయిర్​ఇండియా

ఎయిర్​ఇండియాను.. ఆర్థిక, సాంకేతికంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పారు టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌. అయితే విమానయాన సంస్థ తిరిగి అత్యుత్తమంగా మారాలంటే వ్యవస్థీకృతంగా చాలా మార్పులు అవసరమని అన్నారు. మునుపెన్నడూ లేనంత మార్పులు సంస్థలో చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

  • రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ 2022

దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 38 జట్లతో మొదటి రౌండు మ్యాచ్​లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, క్రికెటర్ల కోసం అన్ని జాగ్రత్తలు భారత క్రికెట్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

  • వచ్చే మూడు నెలలు సినిమాల లిస్ట్

Upcoming telugu movies: కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా చూసేందుకు సినిమాల్లేక చాలామంది ఆడియెన్స్ తెగ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వారి ఆకలి తీర్చేందుకు తెలుగు చిత్రసీమ రెడీ అయింది. రాబోయే మూడు నెలల్లో ప్రతి వారం రెండు కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్​ ఖరారు చేసుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.