ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @7AM

author img

By

Published : Feb 9, 2022, 6:59 AM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్
  • ఇవాళ నిరసనలు చేపట్టాలని కేటీఆర్‌ పిలుపు

TRS Protest : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే... ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.

  • ఇకపై జాతీయ ప్రాజెక్టుకూ 60 శాతం నిధులే

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(PMSKY) కింద ప్రాజెక్టుల గుర్తింపు, నిధుల విడుదలకు సంబంధించి కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పంపింది.

  • దొరికిపోకుండా హ్యాకర్ల మాస్టర్​ ప్లాన్​..

Mahesh Bank Hacking case: మహేశ్​ బ్యాంక్​ సర్వర్​ హ్యాకింగ్​ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించిన ఖాతాదారులు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడున్నారో కనిపెట్టి.. పట్టుకుంటున్నారు. తాజాగా.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న నలుగురిని అరెస్ట్​ చేశారు. వీళ్ల సహకారంతో మిగత రాష్ట్రాల్లో ఉన్న ఖాతాదారులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

  • నేడే మండమెలిగే పండుగ

Medaram Jatara 2022: మేడారం మహాజాతరకు ముహూర్తం దగ్గరపడింది. వచ్చే బుధవారం నుంచి జనసందడి మొదలుకానుంది. వనం వీడి జనం చెంతకు... వనదేవతల ఆగమనం జరగనుంది. ముఖ్యమంత్రిని జాతరకు ఆహ్వానిస్తూ మంత్రులు పత్రికను అందించారు. మరోవైపు మేడారంలో కొద్దిరోజులుగా భక్తుల సందడి కొనసాగుతోంది.

  • యూపీలో ఉగ్రకుట్ర భగ్నం..

NIA arrests al Qaeda operative: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ ముష్కరుడిని ఎన్​ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ఇటీవల లఖ్​నవూలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఎన్​ఐఏ అధికారులు నిర్ధరించారు.

  • రెండు రోజులుగా కొండ చీలికలోనే యువకుడు..

Youth Trapped in a Cliff: కేరళలోని పాలక్కాడ్‌ సమీప మలప్పుజ ప్రాంతంలో కొండ చరియల్లో చిక్కుకుపోయిన యువకుడ్ని రక్షించేందుకు సహాయక బృందాలు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నాయి. తీరప్రాంత రక్షకదళం హెలికాప్టర్‌ కూడా యువకుణ్ని కాపాడే చర్యల్లో నిమగ్నమై ఉంది.

  • హ్యుందాయ్‌ 'కశ్మీర్‌' ట్వీట్‌ వివాదం..

Hyundai Kashmir Issue: 'కశ్మీర్‌' వ్యవహారంపై హ్యుందాయ్‌కు చెందిన ఓ పాకిస్థాన్‌ డీలర్‌ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో ఆ సంస్థ పెను వివాదంలో చిక్కుకుంది. దీనిపై హ్యుందాయ్‌తో పాటు ఆ కంపెనీ సొంత దేశమైన దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది.

  • ఆసియా కుబేరుడు అదానీ

Asia Richest Person 2022: ఆసియా కుబేరుల్లో అగ్రస్థానాన్ని అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అధిరోహించారని బ్లూమ్‌బర్గ్‌ కుబేరుల సూచీ వెల్లడించింది. గత రెండేళ్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 600 శాతానికి పైగా రాణించడమే ఇందుకు కారణం. గౌతమ్‌ అదానీ నికర సంపద 88.5 బిలియన్‌ డాలర్లకు (రూ.6,65,000 కోట్లకు) చేరింది.

  • 'కోహ్లీ-రోహిత్ మధ్య గొడవలా?'

Gavaskar team india: టీమ్​ఇండియా కెప్టెన్- మాజీ కెప్టెన్​కు పడట్లేదు అంటూ వస్తున్న వార్తలను సునీల్ గావస్కర్ మరోసారి కొట్టిపారేశాడు. వాళ్లు బాగానే ఉంటారని చెప్పుకొచ్చాడు. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని సన్నీ అన్నాడు.

  • బాలకృష్ణ కొత్త సినిమా.. తొలి అడుగు ఇక్కడే!

NBK 107: బాలయ్య కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఇక్కడే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కానీ విదేశాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.