ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM - latest news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 8, 2022, 1:02 PM IST

  • రైతులకు ఐదేళ్లు ఉచిత విద్యుత్​: భాజపా

UP BJP Manifesto: రైతులు, యువత, బాలికల సంక్షేమమే ప్రధానాంశంగా ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా. రాబోయే ఐదేళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించింది. వరి, గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చింది. 14 రోజులకు మించి రైతులకు చెరకు బకాయిల చెల్లింపులో జాప్యం జరిగితే మిల్లుల నుంచి వడ్డీ వసూలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది భాజపా.

  • 'వారసత్వ పార్టీలు దేశానికి ప్రమాదకరం'

PM Modi in Rajya Sabha: రానున్న 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలో అందరూ ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశ అభివృద్ధిపైనే దృష్టిసారించాలన్నారు. మరోవైపు రాజ్యసభ వేదికగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు మోదీ. వారసత్వ పార్టీలు దేశానికి ప్రమాదకరమని ధ్వజమెత్తారు.

  • భాజపాకు గుడ్​బై.. కాంగ్రెస్​ గూటికి త్రిపుర ఎమ్మెల్యేలు

Tripura BJP MLA Resign: పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు త్రిపుర భాజపా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీతో సమావేశం అయిన ఇరువురు హస్తం పార్టీలో చేరినట్లు తెలిపారు.

  • భద్రాద్రి ప్రసాదం స్కామ్​పై ఈటీవీ భారత్​ స్టోరీకి స్పందన

Bhadradri Prasadam Scam Update : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచల రామయ్య ప్రసాదం పక్కదారి పడుతుందని వచ్చిన ఆరోపణలపై 'పక్కదారి పడుతున్న భద్రాద్రి రామయ్య ప్రసాదం.. అసలేం జరిగిందంటే!' పేరుతో ఈటీవీ భారత్​ పబ్లిష్ చేసిన కథనానికి స్పందన లభించింది. ఈ విషయంపై స్పందించిన ఆలయ ఈవో శివాజీ.. వంటశాల నిర్వాహకుడు నరసింహాచార్యులకు మెమో జారీ చేశారు.

  • మురిసిపోతున్న ముచ్చింతల్.. అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలు

Ramanuja Sahasrabdi Utsav : ముచ్చింతల్​లో శ్రీరామనుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన 450 మంది వేదపండితులు, జీయర్‌స్వాములు ఈ క్రతువులో పాల్గొన్నారు.

  • 'యాదాద్రి పనులన్నీ... తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి'

YTDA Vice Chairman on Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటనకు రంగం సిద్ధమైందని యాడా వైస్​ఛైర్మన్ కిషన్ రావు తెలిపారు. మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శనయాగంపై సీఎం కేసీఆర్​ సమీక్ష నిర్వహించారని చెప్పారు. యాగం కోసం దాదాపు 6వేల మంది రుత్వికులు వస్తున్నారని.. భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

  • బాలికపై గ్యాంగ్​ రేప్- ముఖంపై కొరికి, చంపేస్తానని బెదిరించి...

MINOR GIRL RAPE CASE: 17 ఏళ్ల గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడు.. ఆమె ముఖంపై పళ్లతో గట్టిగా కొరికాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

  • అంతర్గత పోరులో మయన్మార్‌- కొనసాగుతున్న సైన్యం దాష్టీకాలు

Myanmar Civil War: మయన్మార్‌లో కొనసాగుతున్న పరిణామాలు భారత్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆ దేశంలోని 'చిన్‌' రాష్ట్రం భారత్‌లోని మిజోరం సరిహద్దుగా ఉంది. చిన్‌లో మిలిటరీ జుంటాపై వేలమంది ఉద్యమిస్తున్నారు. దీంతో సైన్యం వారిపై దాడులు చేయడమే గాక, యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తోంది.

  • కొత్తగా '19 ప్లస్​' టీమ్​.. బీసీసీఐ యోచన

Team India U19: అండర్​ 19లో సత్తా చాటిన కుర్రాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా కొత్త ప్రణాళిక రూపొందించనుంది బీసీసీఐ. ఈమేరకు కొత్తగా 'అండర్‌-19+' వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దాని ద్వార యువ ప్రతిభకు ప్రోత్సాహం అందించాలని చూస్తోంది.

  • నిషా కళ్ల చిన్నది.. చూపులతోనే చంపేస్తోంది!

నటి, మోడల్ ఇషితా రాజ్​ శర్మ.. పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 8). ఈ సందర్భంగా ఆమె విశేషాలను చూద్దాం. 'ప్యార్​కా పంచ్​నామా' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.