ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 5, 2022, 8:59 AM IST

  • సమతా మూర్తి నిర్మాణం సాకారమైంది ఇలా..

Statue Of Equality : శ్రీరామనగరంలోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన రామానుజాచార్య బృహన్‌మూర్తి ఆవిష్కరణ నేపథ్యంలో దీని నిర్మాణం వెనుక జరిగిన కృషిని ప్రధాన స్థపతి ‘ఈనాడు-ఈటవీ భారత్​’కు ప్రత్యేకంగా వివరించారు. చినజీయర్‌స్వామి అకుంఠిత దీక్ష, పట్టుదల, శ్రమ.. విగ్రహం నిర్మాణంలో అడుగడుగునా కనిపిస్తాయి.

  • సరస్వతి ఆలయాలు కిటకిట

Vasantha Panchami: వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో.. నిర్మల్​ జిల్లాలోని బాసర, సిద్దిపేట జిల్లాలోని వర్గల్​ దేవాలయాలు కోలాహలంగా మారాయి.

  • మరో రెండు వేల కోట్ల రుణం తీసుకోనున్న సర్కారు

Telangana Loan: రాష్ట్ర అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనుంది. రిజర్వ్​బ్యాంకు ఎనిమిదో తేదీన వేయనున్న బాండ్ల వేలంలో మరో రెండు వేల కోట్లను రుణంగా సమీకరించుకోనుంది.

  • భార్యను హత్య చేసి.. ఆనవాళ్లు చెరిపి..

husband killed wife : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లు అన్యోన్యంగా గడిపారు. ఎమైందో ఏమో కానీ కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసి.. ఆనవాళ్లు దొరక్కుండా దహనం చేశాడు. అనంతరం ఆ విషయం మూడో కంటికి తెలియకుండా కాలగర్భంలో కలిపేందుకు.. తన భార్య కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • యూపీ శకటానికి ఉత్తమ అవార్డు..

UP tableaux award: గణతంత్ర దిన కవాతులో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర శకటానికి ఉత్తమ అవార్డు దక్కింది. కర్ణాటక శకటం ద్వితీయ స్థానంలో నిలిచింది.

  • 'కొవిడ్‌ బాధిత కుటుంబాలను ఆదుకోండి'

COVID death ex gratia applications: కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆదుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్ పరిహారం కోసం ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకుంటే రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (ఎస్‌ఎల్‌ఎస్‌ఏ)ల సభ్య కార్యదర్శులు వారిని గుర్తించి ప్రభుత్వ తోడ్పాటు అందేలా చూస్తారని పేర్కొంది.

  • అమెరికా దాడితో ఐఎస్​ చీఫ్‌ ఆత్మాహుతి

Islamic State leader: ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) గ్రూప్‌ చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌-హషిమీ అల్‌-ఖురేషీ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఖురేషీతో పాటు అతని కుటుంబంలోని మహిళలు, పిల్లలు దుర్మరణం చెందారు. అమెరికా దళాలు కొన్ని నెలల నుంచి ఐఎస్‌ చీఫ్‌ ఖురేషీపై నిఘా పెట్టాయి. అతి కష్టం మీద అతడు ఉంటున్న ఇంటిని గుర్తించాయి.

  • అంబానీ గ్యారేజ్​లోకి అల్ట్రా లగ్జరీ కారు​..

Mukesh Ambani Cars: భారత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే బిజినెస్​ టైకూన్​ ముకేశ్​ అంబానీ. విలాసవంతమైన జీవితం గడిపే ఆయన తాజాగా.. మరో ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ఇది.. భారత్​లో కొనుగోలు చేసిన కాస్ట్​లీ కారుగా గుర్తింపు పొందింది. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా?

  • ఒలింపిక్‌ గోల్డ్ మెడలిస్ట్‌పై నిషేధం

Olympic Gold medallist Ban: ఆ దేశ ప్రధాన మంత్రిని అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించి విమర్శించాడనే కారణంతో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ రషీద్‌ ఉల్‌ హసన్‌పై పదేళ్లపాటు నిషేధం విధించారు. అయితే తాను అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రషీద్​ అన్నాడు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నాడు.

  • చెర్రీ యాక్షన్‌ షురూ..

Ram Charan Shankar Movie: శంకర్​-రామ్​చరణ్​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్​ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌లో చెర్రీపై పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. కాగా, బాలీవుడ్​ హీరో సైఫ్​ అలీఖాన్​ తప్పుకొన్న ఓ చిత్రంలో నటించేందుకు ఆయన భార్య, హీరోయన్​ కరీనా కపూర్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.