1. 'అదే మీ ధ్యేయమా..'
మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆయన ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కావడం లేదని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కరోనా కొత్త లక్షణాలు
కరోనా సెకండ్ వేవ్‌లో ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. తలనొప్పి, వణుకు, కళ్లు ఎర్రబడటం, నీరసపడిపోవటమూ కరోనా లక్షణాల్లో చేరాయి. ఇంకా ఈ జాబితాలో ఏ లక్షణాలున్నాయి? వైరస్ బారిన పడిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆత్మగౌరవ ఉద్యమం మొదలైంది
తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మొదలైందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయనకు మద్దతు తెలిపిన తెలంగాణ ఎన్ఆర్ఐలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'లాక్డౌన్ తప్పనిసరి'
దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్డౌన్ తప్పనిసరిగా విధించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. పేదలకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బిహార్‌లో మే 15 వరకు లాక్డౌన్
దేశంలో కొవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్ననేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 15 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కూలిన మెట్రో
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో వంతెన పైనుంచి రైలు కిందపడి 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. కమ్యూనికేషన్ డిజైనర్లు కావాలనుకుంటున్నారా
గ్రాఫిక్ డిజైన్, ఎడ్వర్‌టైజింగ్, కార్పొరేట్ బ్రాండింగ్, ప్రాడక్ట్ ప్యాకేజింగ్, పబ్లిషింగ్, వెబ్ డిజైన్, మోషన్ గ్రాఫిక్స్, డిజిటల్ యానిమేషన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్... రంగాల గురించి వినే ఉంటారు. మూడేళ్ల బి.డిఇఎస్ (కమ్యూనికేషన్ డిజైన్) కోర్సు చదివితే ఈ రంగాల్లోకి ప్రవేశించి వినూత్నంగా పనిచేయొచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. వయసు 29.. వ్యాపారం రూ.7 వేల కోట్లు!
ఎనిమిది దేశాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం.. ఐదొందలమంది ఉద్యోగులు.. ఏడువేలకోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు.. ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటు! చిన్న వయసులోనే ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్ క్లబ్‌లో అడుగుపెట్టిన అంకితిబోస్ ఈ అద్భుత విజయాలను సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. క్వారంటైన్లో సీఎస్కే
దిల్లీ వేదికగా బుధవారం జరగాల్సిన చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌పై నీలి మబ్బులు కమ్ముకున్నాయి. సీఎస్కే టీమ్‌లో ముగ్గురికి కరోనా సోకడం వల్ల రాజస్థాన్‌తో బుధవారం జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఆ మ్యాచ్ నిర్వహణకు తిరిగి తేదీని ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'శాకినీ-ఢాకినీ'గా రెజీనా, నివేదా!
యువ కథానాయికలు రెజీనా కసెండ్రా, నివేదా థామస్ ప్రధానపాత్రల్లో ఓ యాక్షన్ చిత్రం రూపొందుతోంది. కొరియన్ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్' ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'శాకినీ-ఢాకినీ' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.