'కేటాయింపులకు లోబడే '
గోదావరి బేసిన్లో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదని రాష్ట్ర నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన... కాళేశ్వరం, తుమ్మిడిహట్టిలను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. ఇంకేమన్నారంటే?
'ముద్దాయిగా ఉన్న వ్యక్తి.. మంత్రా?'
ఆలేరుకు నీరందించే ప్రాజెక్టుల విషయంలో తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు. బస్వపురం, గంధమల్ల ప్రాజెక్టుల పేరు చెప్పుకుని గెలిచిన స్థానిక ఎమ్మెల్యేలు నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
శ్రీవారి దర్శనం అప్పుడే
ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని ప్రారంభిస్తామని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. 8, 9 తేదీలలో తితిదే ఉద్యోగులు దర్శనం చేసుకుంటారని.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులతో దర్శనాల ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. కొన్ని షరతులను సైతం వెల్లడించారు. అవి ఏంటంటే?
కారుకోసం కొడుక్కి పెళ్లి!
ఖరీదైన కారుకు ఆశపడి.. తనయుడి జీవితాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధపడ్డాడో తండ్రి. పెళ్లి ఈడుకు రాని కుమారుడిని.. విడాకులు తీసుకున్న 25 ఏళ్ల మహిళకిచ్చి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే...
'వారిని స్వరాష్ట్రాలకు చేర్చాలి'
వలస కూలీలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను అందరినీ 15 రోజుల్లోగా వారివారి స్వస్థలాలకు చేర్చాలని స్పష్టం చేసింది. ఇంకేమన్నదంటే..
ఒక టీచర్.. రూ. కోటి వేతనం
ఓ ఉపాధ్యాయురాలు ఏక కాలంలో 25 పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు ఉత్తర్‌ప్రదేశ్ అధికారులు. కొద్ది నెలలకు గాను మొత్తం కోటి రూపాయలు వేతనాన్ని అక్రమంగా పొందినట్లు తెలుసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది?
ఏనుగు మృతిపై ఎన్జీటీ సీరియస్..
కేరళలో అమానవీయంగా పైనాపిల్‌లో బాంబుపెట్టి ఏనుగును చంపడంపై స్పందించింది జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్. ఏనుగు మృతిని సుమోటోగా స్వీకరించింది. కేరళ అటవీ అధికారులకు ఏమి ఆదేశించిందంటే..?
వెనక్కి తగ్గింది...
కరోనా చికిత్సలో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకోవడం వల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొనే అధ్యయనాన్ని వెనక్కి తీసుకుంది లాన్సెట్ సైన్స్ జర్నల్. ఎందుకలా చేసింది?
లాక్డౌన్లో 3 కోట్లు ఆర్జించిన కోహ్లీ
లాక్డౌన్లో ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధికంగా సంపాదించిన టాప్-10 క్రీడాకారుల జాబితాను ఓ ప్రైవేట్ సంస్థ విడుదల చేసింది. అందులో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానం సంపాదించాడు. ఎన్ని పోస్టులు చేశాడంటే..?
ఫోర్బ్స్‌లో అతనొక్కడే..
ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న 100 మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఇందులో చోటు దక్కించుకున్న అక్షయ్.. ఏకైక భారతీయ స్టార్‌గా నిలిచాడు. వివరాలు ఇలా ఉన్నాయి.