ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@3PM - top ten news for 3pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 3pm
టాప్​టెన్​ న్యూస్​@3PM
author img

By

Published : Dec 23, 2020, 3:00 PM IST

బాధ్యత మనదే

అన్నం పెట్టే రైతన్నలు రోడ్డెక్కడం బాధకరమని మంత్రి నిరంజన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్లకు అనుగుణంగా మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ముందుకు రాకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అనుమానాస్పద మృతి..

చైతన్యపురి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. ఆత్యహత్య చేసుకుందని భర్త చెబుతుండగా... భర్తే హత్యచేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

శ్రీకృష్ణావతారంలో రామచంద్రుడు..

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా తొమ్మిదో రోజైన బుధవారం రామచంద్రస్వామి.. శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8 నెలల వరకు బేఫికర్​!

కొవిడ్​ రోగులకు తీపి కబురు చెప్పారు ఆస్ట్రేలియా పరిశోధకులు. కరోనా​ నుంచి కోలుకున్న వారిలో దీర్ఘకాలం పాటు రోగ నిరోధక శక్తి ఉంటుందని.. ఫలితంగా 8 నెలల వరకు మళ్లీ వైరస్​ బారిన పడకుండా ఉండగలుగుతారని అంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రాజ్​నాథ్​ కీలక వ్యాఖ్యలు

మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పునరుద్ఘాటించారు. రైతులు త్వరలో ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'కిసాన్​ దివస్'​ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రాత్రి కర్ఫ్యూ

కరోనా వ్యాప్తి కట్టడికి రాత్రి​ కర్ఫ్యూ విధించిన మహారాష్ట్ర బాటలోనే పయనించింది కర్ణాటక. జనవరి 2 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని కర్ణాటక సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గడువు ముగుస్తోంది

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్) దాఖలు చేసేందుకు 8 రోజులే మిగిలి ఉంది. ఇంకా రిటర్ను దాఖలు చేయని వారు, మొదటిసారి రిటర్ను దాఖలు చేసేవారు.. చివరి నిమిషం వరకు వేచి చూస్తే.. ఫైలింగ్​లో పొరపాట్లు దొర్లే అవకాశముంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ట్రంప్ క్షమాభిక్ష ​

అగ్రరాజ్యంలో వివిధ నేరాల్లో దోషులుగా తేలిన 15 మందికి క్షమాభిక్షను ప్రసాదించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వారిలో మ్యూలర్​ దర్యాప్తు​లో దోషులుగా తేలిన రిపబ్లికన్​ పార్టీ నేతలు కూడా ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పెద్ద సవాలే!

టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా గురించి సిరీస్​ ప్రారంభానికి ముందే తామంతా లోతుగా ఆలోచించినట్లు ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​ లియోన్​ అన్నాడు. పుజారా లాంటి ప్రపంచస్థాయి బ్యాట్స్​మన్​తో ఆడడం పెద్ద సవాలేనని వెల్లడించాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నన్నెవరూ అరెస్ట్ చేయలేదు

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ సతీమణి సుస్సన్నే ఖాన్​ను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారంటూ పలు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన ఆమె.. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.