ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@3PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 3pm
టాప్​ టెన్​ న్యూస్​@3PM
author img

By

Published : Sep 20, 2020, 2:59 PM IST

1.యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా కాలంలో చాలా రోజుల తర్వాత ఆలయంలో సందడి నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.ప్రజలు చూస్తూ ఊరుకోరు

కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు బిల్లులు ప్రవేశపెడితే... ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ అన్నారు. 20 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.మరో ఘనతను సాధించిన శంషాబాద్​ విమానాశ్రయం

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏసీఐ ఎయిర్‌పోర్ట్ హెల్త్ అక్రెడిటేషన్ లభించింది. ఐసీఏఓ కౌన్సిల్ ఏవియేషన్ రికవరీ టాస్క్ ఫోర్స్ (సీఏఆర్​టీ) ప్రతిపాదనలకు అనుగుణంగా ఆరోగ్యపరమైన చర్యలు తీసుకున్నందుకు ఈ గుర్తింపు వచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.న్యాయం కోసం

రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు మేనేజర్లు మృతి చెందిన ఘటన... సంగారెడ్డి జిల్లా సదాశివపేట్​ మండలం నందికందిలో చోటుచేసుకుంది. న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబసభ్యులు ధర్నా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.ఎస్పారెస్పీకి భారీ వరద ..

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి పై నుంచి వరద కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.వ్యవసాయ బిల్లులకు ఆమోదం

కేంద్రం ప్రతిపాదించిన రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మూజువాణి ఓటుతో బిల్లులు గట్టెక్కాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.అమ్మకు కారు గిఫ్ట్

ఊరి పొలిమేర దాటి ఎరుగని తల్లిని.. స్కూటర్ మీదే దేశామంతా తిప్పి చూపించాడు కర్ణాటకకు చెందిన ఆ తనయుడు. కలియుగ శ్రవణ కుమారుడే అంటూ అతడి ప్రేమకు ఏడాది క్రితం యావత్ భారతం ఫిదా అయిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.చైనాలో మరో వ్యాధి

చైనాలో మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. వేలాది మంది ప్రజలకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధరించారు. బాధితులకు తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.ధోనీ ఎంత అందంగా ఉన్నాడో!

ధోనీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. తమ హీరో మహీ మైదానంలో అడుగుపెట్టగానే అందరి కళ్లలో కాంతులు విరజిమ్మాయి. ఈ క్రమంలోనే అతని భార్య సాక్షి సింగ్​ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆసక్తికర పోస్ట్​ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.రణ్​వీర్​, రోహిత్​ శెట్టి కాంబోలో వినోదాత్మక చిత్రం!

బాలీవుడ్​ దర్శకుడు రోహిత్​ శెట్టి త్వరలోనే ఓ వినోదాత్మక చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇందులో రణ్​వీర్​ సింగ్ హీరోగా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.