ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​ @ 9PM - ts news in telangana

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@9PM
టాప్​టెన్ న్యూస్​@9PM
author img

By

Published : Jun 28, 2020, 9:00 PM IST

తెలుగువారి ఠీవీ- మన పీవీ

బహుముఖ ప్రజ్ఞశాలి, రాజనీతిజ్ఞుడు అన్న పదాలకు సరిపాటిగా నిలిచే వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఎన్నో భాషల్లో నిష్ణాతుడు ఆయన. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఇలా ఏ పదవిని చేపట్టినా తదుపరి వ్యక్తులకు ఓ మార్గ దర్శిగా నిలిచిన వ్యక్తి పీవీ. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

భరతమాత ముద్దుబిడ్డ

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. మనసులో మాట (మన్​కీ బాత్​) కార్యక్రమంలో భాగంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఆందోళన వద్దు

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ... పెరుగుతున్న వేళ వైరస్​ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొద్ది రోజుల పాటు లాక్​డౌన్ విధించాలనే ప్రతిపాదనలపైనా... తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

వీకే సింగ్‌పై బదిలీ వేటు

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్​పై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోలీస్ రిక్రూట్​మెంట్​ బోర్డ్ ఛైర్మన్​ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ... ఈ నెల 24న కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వీకే సింగ్ లేఖ రాశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

పోలీస్‌ అకాడమీపై కోరనా పంజా

రాష్ట్ర పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా సోకింది. ఇందులో ఐపీఎస్ అధికారితోపాటు ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు అదనపు ఎస్పీలు ఉన్నారు. 100 మంది శిక్షణ ఎస్సైలతోపాటు మరో 70 మందికి పైగా సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

భారత్​దే గెలుపు

కరోనా సంక్షోభం, సరిహద్దు ఉద్రిక్తతలను రెండు యుద్ధాలుగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. వాటిలో కచ్చితంగా విజయం సాధించే సామర్థ్యం ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఉందన్నారు. కానీ కాంగ్రెస్​ మాత్రం అన్నిటింలోనూ తప్పులు వెతుకుతోందని.. ఆ పార్టీ ప్రచారాలకు పాకిస్థాన్​, చైనా నుంచి మద్దతు లభిస్తోందని పరోక్ష విమర్శలు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఉగ్రరూపం

ప్రపంచవ్యాప్తంగా కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. రోజురోజుకూ నమోదవుతోన్న కొత్త కేసులు, మరణాల సంఖ్య ఆందోళనకర పరిస్థితిని తెలియజేస్తోంది. ఈ వైరస్​కు ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా బలయ్యారు. ఇందులో ఒక్క బ్రిటన్​ నుంచే 43 వేల మంది ఉండగా.. ఇటలీలో 35 వేలు, ఫ్రాన్స్​లో 30 వేలు, స్పెయిన్​లో 28 వేలు, మెక్సికోలో 26 వేల మంది చనిపోయారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

అమెజాన్‌లో 20 వేల ఉద్యోగాలు

ప్రముఖ వ్యాపార సంస్థ అమెజాన్​... కరోనా సంక్షోభంలోనూ భారత్​లో 20వేల తాత్కాలిక ఉద్యోగాలను కల్పిస్తునట్టు వెల్లడించింది. ఆంగ్లంతోపాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

వాళ్లలో అదే తేడా!

భారత క్రికెటర్లు కోహ్లీ, ధోనీ, రోహిత్​ శర్మ కెప్టెన్సీలపై ఆర్సీబీ వికెట్​ కీపర్​, బ్యాట్స్​మన్​ పార్థివ్​ పటేల్​ స్పందించాడు. కోహ్లీ సారథ్యం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని, ఆటగాడి నుంచి ఏం రాబట్టుకోవాలనే విషయాలు మహీకి బాగా తెలుసని వివరించాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

రజనీ ఫోన్

పోలీసుల హింసాత్మక చర్యలకు తమిళనాడులో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో.. సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్​స్టార్​ రజనీకాంత్​ బాధితుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.