చర్చలు సఫలం
గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులతో మంత్రి ఈటల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూనియర్ వైద్యుల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. గాంధీ ఆస్పత్రి జూడాలు ఆందోళన విరమించి విధుల్లో చేరనున్నారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
సీఎంకు రేవంత్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కరోనాపై యుద్ధం చేస్తున్న జర్నలిస్టులకు సహకరించాలని కోరారు. లేఖలో ఇంకా ఏం రాశారంటే!
ప్రభుత్వ వైఫల్యం వల్లే దాడులు
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై జరిగిన దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. వైద్యులపై దాడి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. బండి సంజయ్ కమెంట్స్ మీరూ చదివేయండి.
తొలకరి జల్లులు
గత రెండు రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసిని వర్షపు జల్లులు పలకరించాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. నగరంలో ఎక్కడెక్కడ వర్షం కురిసిందంటే!
హైకోర్టు టూ సుప్రీం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. వివాదానికి కారణమేంటి..? ఓసారి చూద్దాం.
ప్రత్యేక ప్రార్థనలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణం బుధవారం లాంఛనంగా ప్రారంభం అవుతుందని తొలుత ప్రకటించినా... అలా జరగలేదు. శివుడికి రుద్రాభిషేకం చేసి కార్యక్రమాన్ని ముగించారు పూజారులు. కథనం కోసం ఫాలో అవ్వండి.
పెరిగిన సింహాలు
ఒకానొకప్పుడు అంతరించే దశకు చేరుకొన్న ఆసియా సింహాలు ఇప్పుడు మరింతగా వాటి సంతతిని పెంచుకున్నాయి. జంతు ప్రేమికులకు శుభవార్తనందిస్తూ.. ఐదేళ్ల కాలంలో సుమారు 29 శాతం మేర పెరిగాయి. ఆ వివరాలు మీకోసం.
ట్రంప్ బ్రేక్!
1912, ఏప్రిల్ 15న సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ రహస్యాలను ఛేదించాలని.. ఓ సంస్థ చేపట్టనున్న అన్వేషణ ప్రక్రియకు అడ్డుతగులుతోంది అమెరికా ప్రభుత్వం. అసలు ఏం జరిగిందంటే..?
యూవీ షాక్!
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు, దాదాపు అన్ని ప్రఖ్యాత ట్రోఫీలను ముద్దాడిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులు ట్విట్టర్ ట్రెండింగ్ వార్తలను చూసి షాకయ్యారు. అసలు ఏం జరిగింది?
ఇక ఆగలేం
సెట్లో అడుగుపెట్టడానికి ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు దర్శకధీరుడు రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు జక్కన్న. ఆ పోస్టును మీరూ చూసేయండి.