వాటర్ బాటిల్ ధర కంటే తక్కువే
కొవాగ్జిన్ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. వాటర్ బాటిల్ ధర కంటే తక్కువ ధరలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తామన్నారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్ బయోటెక్ సందర్శన
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించారు. జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కన్నీటి నివాళి
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అంతిమ సంస్కారాలు ఆయన స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సున్నం వారి గూడెంలో నిర్వహించారు. ఆయన కరోనాతో మృతి చెందినప్పటికీ.. ఆ ప్రాంత గిరిజనులు రాజయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేవతలకు ఆహ్వానం
బుధవారం జరగనున్న అయోధ్య రామమందిర భూమిపూజ కోసం దేవాది దేవతలను ఆహ్వానించడానికి రామార్చన పూజను నిర్వహించారు అర్చకులు. మొత్తం నాలుగు దశల్లో ఈ పూజలు జరిగాయి. మరోవైపు రామ మందిర శంకుస్థాపన వేడుక కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేశ ఐక్యతకు నిదర్శనం
అయోధ్య రామమందిర భూమిపూజ దేశ ఐక్యతను చాటుతుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల సౌభ్రాత్రానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రిపోర్టర్‌పై అక్రమ కేసులు
బంగాల్లో 'ఈటీవీ భారత్' రిపోర్టర్ అభిషేక్ దత్తాపై కేసులు నమోదు చేయడంపై కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిషేక్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. పాత్రికేయుల గొంతును నొక్కేందుకే ఈ కేసులు అని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అందాల ఆకేరు వాగు
మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు వాగు అచ్చం బోగత జలపాతం వలే ఉండటం వల్ల పిల్లలు, పెద్దలూ భారీ ఎత్తున తరలివస్తున్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులు రావడం వల్ల తొర్రూరు తహసీల్దార్ రమేశ్ బాబు ఆ ప్రాంత పరిసరాలను పరిశీలించారు. వాగు అందాలను ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చదువుపై ప్రభావం
కరోనా కారణంగా సుదీర్ఘ కాలంగా పాఠశాల మూతపడ్డాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యా అసమానతలు, అభ్యాస నష్టాలను తీవ్రమయ్యాయని వెల్లడించింది ఐరాస. కొవిడ్ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా.. 23 లక్షల 80 వేల మంది వచ్చే ఏడాది విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కన్నీటి పర్యంతం
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గాయని సునీత, నటి-వ్యాఖ్యాత ఝాన్సీ హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీడియోలో చెప్పిన మాటలకు కంటతడి పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇంట్లో ధోనీ ప్రాక్టీసు
ధోనీ ఇంట్లోనే తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నాడని చెప్పిన రైనా.. అతడికి ఫిట్‌గా ఉండేందుకు అలాంటి శిక్షణ పొందుతున్నాడని అన్నాడు. యూఏఈ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.