'కరోనాకు మందు'
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి పేర్కొంది. 'కొరోనిల్' పేరుతో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కీలక నిర్ణయం
గల్వాన్ లోయలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించే దిశగా భారత్- చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. బలగాల ఉపసంహరణపై పరస్పర అంగీకారానికి వచ్చాయి. సోమవారం జరిగిన సైనిక చర్చల ద్వారా ఈ మేరకు పురోగతి సాధించినట్లు భారత సైన్యం వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వ్యవసాయమిక పండుగే..
సిరిసిల్లలో ఆధునిక రైతుబజార్‌ను కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
నో పెండింగ్..
తెరాస ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులు పెండింగ్ పెడితే... వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
తీరు మారాలి!
కరోనా కట్టడిపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలను తీసుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎంతో మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఉద్యోగులకు శుభవార్త..
మంత్రి హరీశ్‌రావును కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక జూన్ నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని, 3 నెలల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ నెల నుంచి జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు అంగీకరించారు. బకాయిలను వాయిదాలలో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
నేపాల్ కాలుదువ్వుతోంది!
భారత్-చైనా సరిహద్దులో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మరో పొరుగుదేశం నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్‌లోని ప్రాంతాలను తమ దేశంలో అంతర్భాగంగా పరిగణిస్తూ మ్యాప్‌ను రూపొందించి.. మరిన్ని వివాదాలు రాజేసేందుకు ప్రయత్నిస్తోంది. సరిహద్దులో మొదలైన ఘర్షణను ఇతర మార్గాలకూ విస్తరిస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
అమెజాన్‌లో మద్యం
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మద్యం హోం డెలివరీకి సిద్ధమైంది. ఇందుకోసం అమెజాన్‌కు బంగాల్ ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. నిత్యావసరాల హోం డెలివరీ సంస్థ బిగ్బాస్కెట్కూ ఈ తరహా సేవలకు అనుమతి లభించినట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రంగుల రింగులు..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్ 23వ తేదీని ఒలింపిక్ దినోత్సవంగా జరుపుతారు. అన్ని దేశాల్లో ఈ రోజున క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన పరుగు కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు, క్రీడలపై సెమినార్లు నిర్వహించి ఆటల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సందడి తగ్గింది.షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది జులై 24న ప్రారంభం కావాల్సిన విశ్వక్రీడలు రద్దయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రియల్ హీరో..
లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. తాజాగా పొలం పనులు చేస్తూ కనిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో 'సేక్రెడ్ గేమ్స్'తో ఈ ఈయన గుర్తింపు పొందారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.