ఉస్మానియాపై విచారణ
ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. కొందరు కూల్చాలంటున్నారని.. మరికొందరు పరిరక్షించాలంటున్నారని పేర్కొంది. ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన పిటిషన్లను ఈనెల 17న విచారించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాజయ్య నిరాడంబరుడు
మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా
ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో 1, 286
రాష్ట్రంలో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12 మంది ఈ మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 68,946కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్తగా 52,050 కేసులు
కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18 లక్షల 50 వేలు దాటింది. ఒక్కరోజులోనే మరో 803 మంది కొవిడ్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పాక్ కుట్రలు కష్టమే
కశ్మీర్‌పై పాక్ చేసిన కుట్రలు అంతర్జాతీయ వేదికలపై ఫలించలేదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ త్రిమూర్తి విమర్శించారు. పాక్ కుట్రలకు ఎప్పటికప్పుడు భారత్ తీవ్రంగా బదులిస్తోందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నీటమునిగిన నగరం
భారీ వర్షాలకు ముంబయి నగరం నీటమునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు మరో 48 గంటలపాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జవాన్లపై అధికారి కాల్పులు
బంగాల్లోని మాల్దాఖండ్ సరిహద్దుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను వారి పైఅధికారి కాల్చిచంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సుశాంత్ కేసు సీబీఐకి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
టీ20 సిరీస్ వాయిదా
కరోనా వ్యాప్తి కారణంగా వెస్టిండీస్‌తో జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేసింది ఆస్ట్రేలియా బోర్డు. ఇదే కారణంతో ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ను వచ్చే ఏడాది నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.