ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@11AM - latest Telangana news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 11AM
టాప్​టెన్​ న్యూస్​@11AM
author img

By

Published : Sep 12, 2020, 10:59 AM IST

1. దేశంలో ఒక్కరోజే 97,570 కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 97 వేల 570 మందికి వైరస్​ సోకింది. మరో 1201 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 46 లక్షల మార్కు దాటింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

2. కరోనా రోగులకు 'గాంధీ' పునర్జన్మ

కరోనా మహమ్మారిని జయించి ఎంతో మంది ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. అందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నది గాంధీ ఆసుపత్రి. కరోనా మొదటి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది 12 వేల మంది ఆరోగ్యవంతులుగా మారి ఇంటికి వెళ్లారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

3. యాదాద్రి దర్శనాలు పునఃప్రారంభం..

మూడు రోజుల పాటు దర్శనాలు నిలిపివేసిన అనంతరం... నేటి నుంచి యాదాద్రిలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ఆదివారం సీఎం కేసీఆర్​ యాదాద్రిలో పర్యటించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

4. ఆర్టీసీ యాజమాన్యానికి.. హైకోర్టు నోటీసు!

తెలంగాణ ఆర్టీసీకి రాష్ట్ర హైకోర్టు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అక్టోబరు 5న కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది. ఉద్యోగులు తమ జీతం నుంచి ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఆర్టీసీ వాడుకుంది. ఉద్యోగులు అడిగినా వారికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఆర్టీసీని సమాధానం చెప్పాలంటూ.. హైకోర్టు నోటీసులు పంపింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

5. యాదాద్రిలో 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్

యాదాద్రిలో 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్ నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

6. నాగార్జున సాగర్​ 12 గేట్లు ఎత్తివేత

ఎగువన భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. సాగర్‌ 12 గేట్లు 10 అడుగుల మేర అధికారులు ఎత్తి.. లక్షా 78వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

7. నేవీ మాజీ అధికారిపై దాడి- ఆరుగురి అరెస్టు

మహారాష్ట్ర ముంబయిలో నేవీ మాజీ అధికారి మదన్​ శర్మపై దాడి చేసిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు సంబంధించిన ఓ కార్టూన్​ను వాట్సాప్​లో పంచుకున్నారు 62 ఏళ్ల రిటైర్డ్ నేవీ అధికారి. ఈ నేపథ్యంలో ఆయనపై శివసేన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

8. ప్రపంచదేశాలపై కరోనా పంజా..

ప్రపంచ దేశాలపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2.86 కోట్లు దాటింది. 9.20 లక్షల మంది వరకు మరణించారు. ఇటలీలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి...

9. పతకాలు, ప్రశంస పత్రాలు వెనక్కివ్వండి..

డోపింగ్​ పరీక్షల్లో విఫలమైన ఆటగాళ్లకు షాకిచ్చింది భారత రెజ్లింగ్​ సమాఖ్య. క్రీడాకారులు గెలుచుకున్న పతకాలు వెనక్కి తీసుకోవాలని ఆయా రాష్ట్ర సంఘాలకు సూచించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

10. రియా డ్రగ్స్​​ కేసులో రకుల్​ప్రీత్​​ పేరు..!

మాదకద్రవ్యాల ​కేసు విచారణలో భాగంగా నటి రియా పలువురి ప్రముఖుల పేర్లు బయటపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 25 మంది జాబితాలో ముగ్గురి పేర్లు బహిర్గతమైనట్లు సమాచారం. ఈ మేరకు రకుల్​ ప్రీత్​ సింగ్​, సారా అలీఖాన్​, సెలబ్రిటీ డిజైనర్ సిమోన్ ఖంబాటాల పేర్లు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.