సైనిక సన్నద్ధతపై సమీక్ష
చైనాతో సరిహద్దు వివాదం, మిలిటరీ చర్చల్లో పురోగతి నేపథ్యంలో... ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లద్దాఖ్‌లోని నిము ప్రాంతంలో ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో భేటీ అయిన మోదీ... సరిహద్దు భద్రతా పరిస్థితులను సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
గోదారమ్మ పరుగులు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపుహౌజ్ నుంచి నీటి పారుదల శాఖ అధికారులు ఎత్తిపోతలు ప్రారంభించారు. 3150 క్యూసెక్కుల జలాలను ఎస్సారెస్పీ వరద కాలువలోకి తరలిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
గర్భిణుల ఆవేదన
హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కొత్తగా వచ్చే గర్భిణులకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. దీనితో గర్భిణులు వెనుతిరిగి పోతున్నారు. తమకు వైద్యం ఎందుకు అందించడం లేదని ఆసుపత్రి సిబ్బందితో గర్భిణులు వాగ్వాదానికి దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
భారత్‌లో రెండో వ్యాక్సిన్
భారత ఫార్మా దిగ్గజం జైడస్ కాడిలా సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ మానవులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతించింది. ఇప్పటికే వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగించి విజయవంతమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
జల ప్రళయం
అసోంలోని 22 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మొత్తం 16 లక్షల మంది ప్రభావితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 34 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
ఏపీలో మరో 837 కరోనా కేసులు
ఏపీలో ఇవాళ కొత్తగా 837 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 16,934కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
మౌనమే ట్రంప్ కొంప ముంచుతోంది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని ముఖ్యమైన అంశాల్లో మౌనం పాటించి చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. చివరకు ఆ విషయాలే అధ్యక్ష పీఠానికీ ముప్పుగా పరిణమిస్తున్నాయి. అసలు ట్రంప్ మౌనం వహిస్తున్న విషయాలేంటి?
బోగస్ కాల్స్‌కు చెక్ ఇలా..
సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అలాంటి మోసాలను అరికట్టేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది. అదే 'వెరిఫైడ్ కాల్స్'. ఇది ఎక్కడ ఉంటుంది? ఎలా పనిచేస్తుంది? వంటి పూర్తి వివరాలు మీకోసం...
వచ్చే ఏడాది పక్కా ఆడతా..
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలంలో కచ్చితంగా పాల్గొంటానని టీమ్ ఇండియా బౌలర్ శ్రీశాంత్ అన్నాడు. వ్యక్తిగతంగా తనకు ముంబయి ఇండియన్స్ తరపున సచిన్ అధ్వర్యంలో ఆడాలనుందని తెలిపాడు. పూర్తి వార్తకోసం క్లిక్ చేయండి.
ఓటీటీ వేదికగా...
సత్యదేవ్ ప్రధాన పాత్రలో 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రిం నిర్మించారు. తాజాగా ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది . పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.