.'కీలక' భేటీ రాష్ట్రంలో లాక్డౌన్ ఈనెలాఖరు వరకు కొనసాగనుందా? కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కేబినేట్ భేటీలో పలు అంశాలు చర్చకురానున్నాయి.'సినీ'కొత్త విధానం..చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం తీసుకొస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. త్వరలోనే సినీ పెద్దలతో చర్చిస్తామన్నారు. థియేటర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటన.దీక్ష షురూరైతుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు 'రైతు సంక్షేమ దీక్ష' చేపట్టారు. గాంధీభవన్‌తో పాటు అన్ని జిల్లాల్లో దీక్షలకు పూనుకున్న హస్తం లీడర్లు.పెద్ద మనసువరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ ఆశ్రమంలో.. వృద్ధులకు నిర్వాహకురాలు యాకూబీ క్షౌరం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో స్వయంగా 20 మందికి క్షౌరం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు యాకుబీ.ఆగని కరోనా ఏపీలో కరోనా కేసుల సంఖ్యకు పుల్‌స్టాప్ పడట్లేదు. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో 67 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కర్నూల్లో అత్యధిక కేసులు. జీ మెయిల్ లాక్ 'డౌన్'భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జీ మెయిల్ సేవలకు అంతరాయం. పెద్ద సంఖ్యలో యూజర్లు జీమెయిల్లోకి లాగిన్ అవ్వడం వల్ల ఏర్పడిన సమస్య. దాదాపు 90 నిమిషాలకుపైగా సేవలకు ఆటంకం.జూలై 18 నుంచి..జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది కేంద్రం. జులై 18- 23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో అడ్వాన్స్డ్ పరీక్షలు, జులై 26న నీట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.షాకింగ్ ధరలులాక్డౌన్ వేళ దేశ రాజధాని దిల్లీలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. చమురుపై 27 శాతంగా ఉన్న వ్యాట్‌ను 30 శాతానికి పెంచుతూ దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కారణం.సచిన్ ఓ తుఫాన్!1998లో షార్జా వేదికగా జరిగిన కోకో కోలా కప్‌ను గుర్తు చేసుకున్న సచిన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ విశేషాలను తాజాగా వెల్లడించాడు. అప్పుడే తొలిసారి తాను.. ఇసుక తుపాన్‌ను చూసినట్లు చెప్పుకొచ్చాడు. అర్జున్‌రెడ్డికి చిరు సూచనఅసత్య వార్తలను పట్టించుకోవద్దని విజయ్ దేవరకొండకు మెగాస్టార్ చిరంజీవి సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా రాయొద్దంటూ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.