ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్ 7AM - Telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA TODAY
TELANGANA TODAY
author img

By

Published : Sep 13, 2022, 6:59 AM IST

  • ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

సికింద్రాబాద్‌లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జ్‌లో ఘటన జరిగింది. సెల్లార్‌లో ఎలక్ట్రికల్‌ ద్విచక్రవాహనాల బ్యాటరీలు పేలి మంటలు పైన ఉన్న లాడ్జీలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.

  • మరో 833 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటనను జారీ చేసింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

  • ఇకపై ఎలక్ట్రిక్​ హైవేలు.. టోల్​ప్లాజా వద్ద ఇక 'ఆగేదే లే'

Electric Highways In India : త్వరలో ఎలక్ట్రిక్​ హైవేలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. ఇకపై రైళ్ల లానే వాహనాలు కూడా రోడ్లపై పరుగులు తీయనున్నాయి. మరోవైపు టోల్‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను తీసుకురానుంది కేంద్రం.

  • సోనాలి ఫోగాట్‌ హత్య కేసును సీబీఐకి అప్పగించిన కేంద్రం

Sonali Phogat Death : నటి, భాజపా నాయకురాలు సోనాలి ఫోగాట్‌ హత్య కేసును సీబీఐకి అప్పగించింది కేంద్రం. గోవా పర్యటనలో భాగంగా సోనాలీ ఫోగాట్‌ ఆగస్టు నెలలో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. దీనిపై పలువురు నిందితులను ఇప్పటికే పనాజీ పోలీసులు అరెస్టు చేశారు.

  • కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించిన ఆటోడ్రైవర్​.. దిల్లీ సీఎం ఏమన్నారంటే..

Kejriwal Gujarat Visit : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈ తరుణంలోనే ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయనను.. ఇంటికి రావాలని ఆహ్వానించాడు ఓ ఆటోవాలా. దీనిపై ఆయన ఏమన్నారంటే?

  • ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై కాల్స్‌లో ఆ ఇబ్బందులు ఉండవ్!

Android 13 update : ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నాయిస్‌ డిస్ట్రబెన్స్‌ వస్తే ఎంతో చిరాగ్గా ఉంటుంది. అంతేకాదు, అవతలి వ్యక్తి ఏం చెప్తున్నాడనేది కూడా సరిగా వినపడదు. గూగుల్ త్వరలో విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ 13లో ఈ సమస్యకు చెక్‌ పెట్టనుంది. ఇందుకోసం కొత్త ఓఎస్‌లో క్లియర్‌ కాలింగ్‌ పేరుతో నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను తీసుకొస్తుంది. యూజర్‌ ఫోన్‌ కాల్స్‌ మాట్లాడేప్పుడు ఈ ఫీచర్‌ నాయిస్‌ డిస్ట్రబెన్స్‌ను తగ్గిస్తుంది. క్లియర్‌ కాలింగ్‌ ఫీచర్‌ అన్ని మొబైల్‌ నెట్‌వర్క్‌లకు పనిచేస్తుంది. వైఫై ద్వారా చేసే ఫోన్స్‌ కాల్స్‌లో ఈ ఫీచర్‌ పనిచేయదని సమాచారం.

  • 'అమ్మ బాటలోనే నా పయనం'.. పార్లమెంట్​లో బ్రిటన్​ రాజు తొలి ప్రసంగం

Britain New King Parliament : బ్రిటన్​కు నూతన రాజుగా ఎన్నికైన వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్​ పార్లమెంట్​ను ఉద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణి, తన తల్లి ఎలిజబెత్​ను గుర్తు చేసుకున్న ఆయన.. పాలనలో ఆమె దారిలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేశారు. తన తల్లి నిస్వార్థ కర్తవ్య పాలనకు ఉదాహరణగా నిలిచారన్నారు. రాజుగా ఎన్నికైన తర్వాత ఛార్లెస్​ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంట్​ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉపిరి లాంటిదని అభిప్రాయపడ్డారు ఛార్లెస్​. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు సహా దాదాపు 900 మంది హాజరయ్యారు.

  • జియో నుంచి శాటిలైట్ సేవలు.. అనుమతులు జారీ చేసిన 'డాట్'!

JIO Satellite: శాటిలైట్‌ ద్వారా అంతర్జాతీయ మొబైల్‌ వ్యక్తిగత కమ్యూనికేషన్‌(జీఎమ్‌పీసీఎస్‌) సేవలను అందించడానికి జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌కు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) అందిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో లైసెన్స్‌డ్‌ సర్వీస్‌ ప్రాంతాల్లో జీఎమ్‌పీసీఎస్‌ సేవలను కంపెనీ ఏర్పాటు చేసి.. నిర్వహించుకోవచ్చు. మరోవైపు దేశంలోనే తొలిసారిగా హెచ్‌టీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ వాణిజ్య సేవలను ప్రారంభించినట్లు హ్యూజ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

  • కోహ్లీ, అనుష్క శర్మ కాఫీ డేట్​.. ఫొటోలు వైరల్​

ఎప్పుడూ వార్తల్లో ఉండే సెలబ్రిటీ జంట విరాట్​ కోహ్లీ, అనుష్క శర్మ. వీరిద్దరూ కాఫీ డేట్​కి వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు సోషల్​ మీడియాలో అనుష్క శర్మ పంచుకుంది. దాంతో పాటు ఓ లవ్ ఈమోజీని క్యాప్షన్​గా జోడించింది.

  • సీక్వెల్ ట్రెండ్.. తొలి భాగం బోల్తా.. కొనసాగింపు చిత్రం ఉంటుందా?

'అనగనగా..' అంటూ మొదలైన ప్రతి కథా.. సుఖాంతమో, విషాదాంతమో ఏదోరకంగా కంచికి చేరి శుభం కార్డు వేసుకోవల్సిందే. అయితే అన్ని కథల విషయంలోనూ ఇలాగే జరగాలని రూలేం లేదు. రెండు భాగాల ట్రెండ్‌ మొదలయ్యాక కంచికి చేరకుండా కొనసాగింపు బాట పడుతున్న చిత్రాల సంఖ్య ఎక్కువైంది. నిజానికి ఇలా కొనసాగింపు లక్ష్యంతో మొదలైన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కుతాయా? లేదా? అన్నది తొలి భాగం విజయంపైనే ఆధారపడి ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.