ETV Bharat / state

Telangana Top News: టాప్​టెన్​ న్యూస్​ 7AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news
telangana top news
author img

By

Published : Sep 4, 2022, 6:56 AM IST

  • ఇతర రాష్ట్రాల్లా.. భాజపా ఆటలు ఇక్కడ సాగవు

దేశంలో బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ ఎదగడం భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు సర్వశక్తులనూ ఉపయోగిస్తోందని.. త్వరలోనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని చెప్పారు.

  • మరో 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ విభాగాల్లో 1,540 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 22 నుంచి అక్టోబర్‌ 14వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది.

  • ఏటీసీలోకి చొరబడి విమానం టేకాఫ్‌కు ఒత్తిడి

ఛార్టర్డ్ విమానం టేకాఫ్​కు అనుమతి ఇవ్వాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులపై ఇద్దరు భాజపా ఎంపీలు ఒత్తిడి చేశారు. రాత్రి సమయంలో టేకాఫ్ చేసేందుకు అనుమతి లేదని, కానీ ఎంపీలు ఒత్తిడి తెచ్చి విమానంలో వెళ్లారని ఎయిర్​పోర్ట్ డీఎస్పీ ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • ప్రపంచంలోనే అతిపెద్ద పెన్ను.. హైదరాబాద్​ వాసి రికార్డు

World Biggest Pen : సాధారణంగా పెన్నులు అంటే జేబులో పెట్టుకునేలా చిన్నగా ఉంటాయి. కానీ ఈ పెన్ను మాత్రం 20 అడుగుల పొడవు ఉంటుంది. దీంట్లో రికార్డర్​తో పాటు సీసీటీవీ కెమెరా కూడా ఉంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పెన్ను ప్రపంచంలోనే అతిపెద్దది అంటున్నారు రూపకర్త. ఇంత పెన్ను ఎలా రాస్తుంది? బొమ్మ పెన్ను అనుకునేరు.. చక్కగా రాస్తుందటా మరి ఆ పెన్ను కథేంటో చూద్దాం పదండి.

  • నాసా ఆర్టెమిస్‌-1 ప్రయోగం మళ్లీ వాయిదా

Artemis I launch : అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. రాకెట్‌లో ఇంధన లీకేజీని అరికట్టడంలో ప్రయత్నాలు సఫలం కాకపోవడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా తెలిపింది. అయితే, తిరిగి మళ్లీ ఎప్పుడు ప్రయోగిస్తామనే వివరాలను వెల్లడించలేదు. కాగా.. ఇంజిన్‌ నంబర్‌-3లో లీకేజీ సమస్య వల్ల రాకెట్‌ లాంఛ్‌ను తొలుత వాయిదా వేసింది. తిరిగి సెప్టెంబర్‌ 3న ప్రయోగిస్తున్నట్లు వెల్లడించగా తాజాగా మళ్లీ వాయిదా పడింది.

  • తైవాన్​కు అమెరికా భారీ ప్యాకేజీ..

Taiwan vs China : తైవాన్​కు భారీగా ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది అమెరికా. రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం ఆ దేశానికి క్షిపణులు, రాడార్ హెచ్చరిక వ్యవస్థలను అందించనుంది. చైనా సైనిక చర్యలను ఎదుర్కొనేందుకు ఈ ఆయుధాల కొనుగోలు సహాయపడుతుందని తైవాన్ రక్షణశాఖ పేర్కొంది.

  • విమానంతో ఢీకొడతానని వాల్​మార్ట్​కు బెదిరింపు

Walmart Plane Crash : విమానంతో వాల్‌మార్ట్‌ స్టోర్‌ను ఢీకొంటానని ఓ పైలట్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. చిన్న విమానంతో ఆ స్టోర్‌ చుట్టూ ఆకాశంలో చక్కర్లు కొట్టాడు. ఈ ఘటన అమెరికా మిసిస్సిపీ రాష్ట్రంలోని టుపెలోలో జరిగింది.

  • ప్రపంచకప్​కు స్టార్​ ఆల్​రౌండర్​ డౌటే!

Jadeja Ruled Out : టీ-20 వరల్డ్​కప్​కు ముందు టీమ్​ ఇండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆసియా కప్​కు దూరమైన భారత స్టార్​ ఆల్​రౌండర్​ కీలక టీ-20 ప్రపంచకప్​కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

  • కేతిక శర్మ చేసిన పనికి అలా ట్వీట్​ చేసిన దేవీ శ్రీ

దేవీ శ్రీ ప్రసాద్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. తన మ్యూజిక్​తో సంగీత ప్రియులను ఊర్రూతలూగిస్తుంటారు. ఆయన పాటకు, సంగీతాన్ని ఫిదా అవ్వని వారుండరు. అయితే తాజాగా ఆయన ఓ యంగ్​ హీరోయిన్ పాటకు ఫిదా అయిపోయారు. ఎవరంటే..

  • పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మి.. కానీ ఓ ట్విస్ట్​..

Anchor rashmi marriage జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్​గా కెరీర్ ప్రారంభించి యూత్​లో క్రేజ్​ సంపాదించుకుంది రష్మి. అలానే అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. స్టేజిపై గ్లామర్ ఒలికిస్తూ సూపర్​ ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.