ETV Bharat / state

Telangana News Today : టాప్​న్యూస్ @7AM - today news in Telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news
Top ten news
author img

By

Published : Aug 10, 2022, 6:59 AM IST

  • బిహార్‌లో కొత్త పొత్తు.. భాజపాకు జేడీయూ గుడ్​బై

Bihar Politics: బిహార్​ రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. అధికార జేడీ(యు).. ఎన్‌డీయే కూటమి నుంచి వైదొలగింది. ఆ కూటమి ప్రభుత్వానికి రాజీనామా చేసిన నీతీశ్‌కుమార్‌ .. వెనువెంటనే ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహాకూటమి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణం చేయనున్నారు నితీశ్​కుమార్​.

  • రూ.2 లక్షలకు 'ఆమె'ను అమ్మిన మామ​..

విహారయాత్రకు తీసుకెళ్తానని నమ్మించి యువతిని ఓ వ్యక్తి రూ.2 లక్షలకు విక్రయించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో వెలుగులోకి వచ్చింది. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో భర్తపై పెట్రోల్​ పోసి నిప్పంటించింది ఓ భార్య. తీవ్ర గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

  • మంత్రివర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు..

telangana cabinet meeting:తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 11న (గురువారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చ జరపనుంది.

  • కమలంతో మిత్రభేదం.. ఎన్డీయేను వీడుతున్న కీలక పార్టీలు

NDA alliance party list 2022: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి భాగస్వామ్య పక్షాలతో అంతగా పొసగడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శివసేన, అకాలీదళ్ పార్టీలు ఎన్డీఏకు దూరం కాగా.. తాజాగా జేడీ(యు) సైతం గుడ్​బై చెప్పడం ఇందుకు నిదర్శమని వివరిస్తున్నారు.

  • 'కౌలు'కోలేని దెబ్బ.. నగలు తాకట్టు పెట్టినా.. పుట్టని అప్పు

ఇటీవల కురిసిన భారీవర్షాలకు వ్యవసాయం అస్తవ్యస్తంగా మారింది. వరద పోటుతో పంటలన్నీ కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగలు తాకట్టు పెట్టినా.. అప్పు పుట్టడంలేదని ఘొల్లుమంటున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో కర్షకుల కష్టాలు..

  • అద్దె ఇళ్లలోనే 12వేలకు పైగా అంగన్‌వాడీలు..

రాష్ట్రంలో అంగన్​వాడీల నిర్వహణ అధ్వానంగా మారిపోయింది. 12వేలకు పైగా కేంద్రాలకు సొంత భవనాలు కరవయ్యాయి. ఇప్పటికీ భవన నిర్మాణాలు పూర్తికాని కేంద్రాలన్నీ కనీస వసతుల్లేని అద్దెగూళ్లలో సాగుతున్నాయి. వీటిలో చదువుకునేందుకు వచ్చే చిన్నారులు, పోషకాహారం కోసం వచ్చే బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు.

  • ఆర్థిక నేరగాళ్లకు చెక్‌.. ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే!

DGCA statement on international flights: ఆర్థిక నేరగాళ్లకు పాల్పడి విదేశాలకు పారిపోయే మోసగాళ్లకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి విమానయాన సంస్థా విదేశీ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్‌ అధికారులకు ఇవ్వాలని స్పష్టంచేసింది.

  • రిలయన్స్​ అధినేత.. గూగుల్​​ సీఈఓ.. క్రికెట్​ కలిపిందీ ఇద్దరినీ!

Mukesh Ambani Sundar Pichai: దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ, గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ను క్రికెట్​ కలిపింది. అవును.. ఆ ఇద్దరూ కలిశారు. ఇప్పుడూ ఫొటోలు నెట్టింట తెగ హల్​చల్​ చేస్తున్నాయి. ఇంతకీ ఎక్కడో తెలుసా?

  • వద్దంటున్నా.. లంక వైపు వస్తున్న 'చైనా నిఘా' నౌక!

China Spy Ship: చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5.. శ్రీలంక దిశగా ప్రయాణిస్తోంది. ఇప్పటికే ఆ దేశ అధికారులు నౌక రాకను వాయిదా వేయాలని కోరినా.. చైనా వినిపించుకోవడం లేదు. అయితే ఈ యుద్ధ నౌక సాయంతో భారత్‌ క్షిపణి పరీక్షలను చైనా పరిశీలించి సమాచారం సేకరించే అవకాశం ఉంది.

  • అప్పుడు చాలా బాధేసింది.. హృతిక్​, అక్షయ్ ధైర్యమిచ్చారు!

Nithin Macharla Niyojakavargam: హీరో నితిన్ నటించిన కొత్త సినిమా 'మాచర్ల నియోజకవర్గం'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర విశేషాలు తెలిపారాయన. కెరీర్​లో తాను ఎదుర్కొన్న విమర్శలు, ఆ సమయంలో ఎవరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లారు సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.