ETV Bharat / state

టాప్​ న్యూస్​ - తెలంగాణలో వార్తలు

Top Headlines
టాప్​ న్యూస్
author img

By

Published : Jul 20, 2021, 5:03 PM IST

Updated : Jul 20, 2021, 9:55 PM IST

21:49 July 20

1. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

ప్రస్తుత నీటి సంవత్సరానికి కృష్ణా జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు చెరిసగం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు లేఖ రాశారు. 

2. 6 జలాంతర్గాముల కోసం భారత నేవీ రూ. 50వేల కోట్లు

నౌకా దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది రక్షణ మంత్రిత్వశాఖ. ప్రాజెక్టు-75 కింద.. దేశంలో ఆరు అధునాతన డీజిల్​, ఎలక్ట్రిక్​ సబ్​మెరైన్లను నిర్మించేందుకు రూ.50,000 కోట్ల విలువైన టెండర్లను మజగావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌(ఎండీఎల్), ఎల్​ అండ్‌ టీకి జారీ చేసింది.

3. ఆధార్​లో ఫోన్​ నెంబర్​ను మార్చాలా? ఇలా చేయండి!

ఆధార్​లో ఫోన్​ నెంబర్​ను సులభంగా మార్పుకునే విధానాన్ని కేంద్రం తీసుకురానుంది. పోస్ట్​మెన్​ సాయంతో ఇంటి వద్దే మార్చుకునే వెసులుబాటు కలిగించింది.

4. కుబేరుల 'రోదసి' పోరులో.. విశేషాలెన్నో!

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ మంగళవారం అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. బ్రిటన్​ కుబేరుడు రిచర్డ్​ బ్రాన్సన్​ ఇప్పటికే యాత్ర ముగించేశారు. ఈ నేపథ్యంలో వీరి యాత్రలకు సంబంధించిన విశేషాలు చూద్దాం..

5. ఆ సంగీత కళాకారులకు అండగా మనో

గాయకుడు మనో తనలోని ఉదారతను చాటుకున్నారు. కరోనా రెండో దశతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న 200 మంది సంగీత కళాకారులకు నిత్యావసర సరకులను స్వయంగా అందించారు.

19:55 July 20

1. KTR Vaccination: మొదటి డోసు టీకా తీసుకున్న కేటీఆర్​.. వ్యాక్సిన్ ఏంటని నెటిజన్ల ఆసక్తి

మంత్రి కేటీఆర్​ వ్యాక్సిన్​ తీసుకున్నారు. నేడు మొదటి డోసు టీకా తీసుకున్న మంత్రి.. తనకు వ్యాక్సిన్​ వేసిన వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే రాష్ట్రంలో ఎంతో మందికి టీకాలు వేస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ప్రశంసించారు.

2. CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు

సింగరేణి కార్మికులకు(Singareni workers ) శుభవార్త(good news). వారి పదవీ విరమణ వయసును (retirement age)61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈనెల 26న జరగనున్న బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

3. Minister Gangula: 'గుట్కా, తంబాకు తినాలంటే నాలుగు గోడల మధ్య తింటం'

తాను గుట్కా తింటున్నట్లు వస్తున్న ఆరోపణలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే తన మీద విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

4. యోగా చేస్తుండగా ప్రమాదం- ఆసుపత్రిలో మాజీ మంత్రి

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ యోగా చేస్తుండగా కింద పడ్డారు. మెదడులో రక్తం గడ్డకట్టగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

5. ఉద్యోగులకు డీఏ పెంపుపై కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్ర కేబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు.. ఉద్యోగులకు డీఏ పెంపుపై ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచే పెంపును అమలు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించింది.

18:47 July 20

టాప్​ న్యూస్

1. చరిత్ర సృష్టించిన బెజోస్​- స్పేస్​ టూర్​ సక్సెస్​

జెఫ్​ బెజోస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా సాగింది. బ్లూ ఆరిజిన్​ రూపొందించిన అంతరిక్ష నౌక నలుగురు సభ్యులతో నింగిలోకి దూసుకెళ్లింది. భూమికి 100 కిలోమీటర్లకన్నా ఎత్తులో కార్మాన్ రేఖను దాటి వెళ్లిన బెజోస్ బృందం... కొన్ని నిమిషాల పాటు అక్కడి ప్రత్యేక పరిస్థితులను ఆస్వాదించింది.

2. PMAYG: 'పీఎంఏవై-జీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదు'

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఏడేళ్లలో కేటాయించిన ఇండ్లు, విడుదల చేసిన నిధులపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్... లోక్​సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2022 నాటికి అందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేయట్లేదని కేంద్ర మంత్రి సాధ్వి వెల్లడించారు.

3. 'దేశంలో ఇంకా 33% మందికి కరోనా ముప్పు!'

దేశంలో ఇంకా 40 కోట్ల మంది కరోనా ఇన్​ఫెక్షన్​కు గురయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. దేశ జనాభాలో మూడింట రెండొంతుల మందిలో మాత్రమే ప్రస్తుతం కొవిడ్​ యాంటీబాడీలు ఉన్నట్లు ఐసీఎంఆర్​ సర్వే ఆధారంగా వెల్లడించింది.

4. Tokyo Olympics: ఒలింపిక్స్​ ఆఖరి నిమిషంలోనైనా రద్దు అవ్వొచ్చు!

టోక్యో ఒలింపిక్స్​ను ఆఖరి నిమిషంలో రద్దు చేయోచ్చనే వార్తలను నిర్వాహక కమిటీ అధ్యక్షుడు తోషిరో ముటో తోసిపుచ్చలేకపోయారు. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఈ మెగా ఈవెంట్​ అర్ధాంతరంగా ఆపే సూచనలున్నాయని ఆయన పరోక్షంగా తెలియజేశారు.

5. Virata Parvam OTT: ఓటీటీ రిలీజ్​పై దర్శకుడు క్లారిటీ

కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన 'విరాటపర్వం'(Virata Parvam OTT) చిత్రం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్పందించిన దర్శకుడు వేణు ఊడుగుల.. సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పారు.

18:05 July 20

1. LAND VALUE: భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువల పెంపు.. 22 నుంచి అమలు

వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

2. కోల్​కతాలో హైదరాబాద్​ వాసి అనుమానాస్పద మృతి

హైదరాబాద్​కు చెందిన బ్యాంకు ఉద్యోగి కోల్​కతాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అయితే.. ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. కానీ మృతదేహం కాళ్లు, చేతులు తాళ్లతో కట్టివేసి ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

3. 'కరోనాపై కేంద్రానివి తప్పుడు లెక్కలు!'

కరోనా కట్టడిపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్షాలు ఆరోపించగా.. అధికార పక్షం తిప్పికొట్టింది.

4. అధ్యక్ష భననం లక్ష్యంగా రాకెట్​ బాంబు దాడులు!

అఫ్గానిస్థాన్ అధ్యక్ష భవనం లక్ష్యంగా రాకెట్​ బాంబు దాడులు జరిగాయి. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ ప్రసంగానికి కొద్దిసేపటి ముందే ఈ దాడి జరిగింది. అయితే రాకెట్ బాంబులు అధ్యక్ష భవనం బయటే కూలినట్లు వెల్లడించారు అక్కడి అధికారులు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.

5. ఓలా ఈ- స్కూటర్.. రంగు అదుర్స్​!

ఎలక్ట్రిక్ వాహన విపణిలోకి ప్రవేశించిన ఓలా సంస్థ.. తాము ప్రవేశపెట్టనున్న ఈ-స్కూటర్​పై ఓ అప్డేట్​ ఇచ్చింది. కొత్త రంగు ఈ-స్కూటర్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

16:42 July 20

టాప్​ న్యూస్

1. భూముల వేలం పారదర్శకంగా జరిగింది: ప్రభుత్వం

భూముల వేలం పారదర్శకంగా జరిగిందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంపై వివరణ ఇచ్చింది. ఆ భూముల వేలంపై ఆరోపణలు నిరాధారమని వెల్లడించింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదని... ఆన్‌లైన్‌లో 8 నిమిషాలపాటు వేలం పాటకు అవకాశమిచ్చామని తెలిపింది. 

2. delta variant: బీ అలర్ట్‌.. గాలి ద్వారా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి

రాష్ట్రంలో డెల్టా వేరియంట్​ను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్నామని డీహెచ్​ శ్రీనివాస రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు కొవిడ్​ ఎక్కువగా వ్యాపిస్తున్న జిల్లాల్లో పర్యటిస్తున్నామని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించామన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతను పక్కన పెట్టారని... లాక్​డౌన్​లో నిబంధనలు పాటించినట్లే ఇప్పుడు పాటించాలని సూచించారు. 

3. ETELA: 'తెరాస నాయకులు ఎన్ని పైసలిచ్చినా తీసుకోండి.. అవన్నీ మనయే'

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్​ చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. గూడూరు, నేరెళ్ల, లక్ష్మీపూర్‌, కాశింపల్లి, పంగిడిపల్లి, వంగపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతోంది. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

4. KCR review: గొర్రెల యూనిట్​ ధర పెంచుతూ కేసీఆర్ నిర్ణయం

రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ దఫా పంపిణీ కోసం మరో 6000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో వృత్తి కులాలైన బీసీవర్గాల అభ్యున్నతి, ప్రభుత్వ కార్యాచరణ, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

5. రెండోరోజూ పెగాసస్​ రగడ - గురువారానికి లోక్​సభ వాయిదా

లోక్​సభలో పెగాసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళన చేయడం వల్ల పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ వాయిదాల పర్వం కొనసాగింది. ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే దిగువ సభ గురువారానికి వాయిదా పడింది.

6. ఎస్​బీఐ క్లర్క్​ మెయిన్స్ పరీక్ష వాయిదా

ఎస్​బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. జులై 31న జరగాల్సిన ఈ పరీక్షను(SBI clerk exam 2021) వాయిదా వేసింది. అయితే పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

7. ఆ బామ్మ రూ.77లక్షల పింఛను పోగొట్టుకుంది!

పింఛను పథకం తనకు వర్తిస్తుందని తెలియక గడిచిన 20 ఏళ్లలో సుమారు రూ.77లక్షలను కోల్పోయారు యూకేలోని ఓ వందేళ్ల వృద్ధురాలు. ఇంగ్లాండ్​లోని క్రైడాన్​లో 1921లో జన్మించిన మార్గరెట్ బ్రాడ్​షా.. వృత్తిరీత్యా కెనడాలో 30ఏళ్ల పాటు నివసించారు. దీంతో 1990లో తిరిగి స్వదేశానికి చేరుకున్నాక.. జాతీయ పింఛను పథకం తనకు వర్తించదని భావించారు.

8. రెండో రోజూ నష్టాలు- సెన్సెక్స్ 355 పాయింట్లు డౌన్

స్టాక్​ మార్కెట్లను వరుసగా రెండో రోజూ నష్టాలు కుదిపేశాయి. సెన్సెక్స్ (Sensex Today) 355 పాయింట్లు తగ్గి.. 52,200 దిగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 120 పాయింట్ల నష్టంతో 15,650 మార్క్​ను కోల్పోయింది.

9. ICC Rankings: అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ

మంగళవారం అంతర్జాతీయ క్రికెట్​ మండలి విడుదల చేసిన క్రికెట్​ ర్యాంకింగ్స్​లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. వన్డేల్లో కెప్టెన్​ మిథాలీ రాజ్​(Mithali Raj), టీ20ల్లో షెఫాలీ వర్మ(Shafali Verma) అగ్రస్థానంలో నిలవగా.. స్మృతి మంధాన(Smriti Mandhana) కెరీర్​లో ఉత్తమ ర్యాంకుకు చేరుకుంది.

10. అమలాపాల్​ గ్లామర్​ షో.. బికినీలో అందాల ఆరబోత

అమలాపాల్​.. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెరపైనే కాకుండా సోషల్​మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ కుర్రకారుల్ని మతి పోగొడుతుంటుంది. ఇవాళ ఈ హాట్​ భామకు సంబంధించిన ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

Last Updated : Jul 20, 2021, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.