- మరో 1,763 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,763 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 8 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. కాగా మొత్తం బాధితుల సంఖ్య 95,700కు చేరింది. ఇప్పటివరకు 719 మంది మరణించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఇల్లు కూలి ముగ్గురు దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాలలో విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఓ ఇంటి కప్పు నానిపోయి కూలింది. ఈ ఘటనలో ముగ్గురు చెందారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- రెండో అతి పెద్ద వరద
గోదావరిలో శ్రీరామసాగర్ నుంచి ధవళేశ్వరం వరకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నదికి వచ్చిన భారీ వరదతో 24 గంటల్లో 150 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. 1986 తర్వాత గోదావరికి ఇప్పడు వచ్చిన వరద రెండో అతి పెద్ద వరదగా పోలవరం ఇంజినీర్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- జూరాలలో రెండు మృతదేహాలు
జూరాల జలాశయంలో స్థానికులు రెండు మృతదేహాలను గుర్తించారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. పంచదేవుపాడు వద్ద పుట్టి మునిగి గల్లంతైన వారిగా అధికారులు అంచన వేస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మరో ఎమ్మెల్యేకు కరోనా
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మళ్లీ వానలు...
గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో... వాగలు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల పంటలు దెబ్బతినగా... మరికొన్ని ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో భారీ వర్షం నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- కొత్త విద్యా విధానం...
విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన దిశగా నూతన విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) తీసుకువచ్చింది కేంద్రం. బుద్ధికుశలతను, సృజనశీలతను ఆవిష్కరించడమే పరమార్థంగా చేసిన ఈ నూతన విద్యావిధానం అమలులో కొన్ని సవాళ్లను అధిగమించక తప్పదంటున్నారు నిపుణులు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- అమెరికా-చైనా అంగీకారం
అమెరికా-చైనాల మధ్య నడుస్తున్న విమానాల సంఖ్య రెట్టింపు చేసేందుకు రెండు దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయి. ప్రస్తుతం చెరో నాలుగు విమాన సేవలు అందుబాటులో ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 8కి చేరనుంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- పంచ 'ఖేల్'రత్నాలు
క్రీడాకారుల పంట పండింది. ఊహించని విధంగా అత్యధిక మందికి ఈసారి అవార్డులు సొంతం కానున్నాయి. అసాధారణ రీతిలో ఐదుగురు ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. రోహిత్‌శర్మ (క్రికెట్), వినేశ్ ఫొగాట్ (రెజ్లింగ్), రాణి రాంపాల్ (హాకీ), మనిక బాత్రా (టీటీ), మరియప్పన్ తంగవేలు (పారాలింపిక్స్)లను అవార్డులు వరించనున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- 'బ్లాక్ రోజ్'గా ఊర్వశీ రౌతేలా టాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్ అందాల తార ఊర్వశీ రౌతేలా ప్రధానపాత్రలో తెలుగులో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ప్రమఖ దర్శకుడు సంపత్ నంది కథను అందించగా.. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి