ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​న్యూస్ 9PM
టాప్​న్యూస్ 9PM
author img

By

Published : Sep 19, 2022, 8:59 PM IST

  • తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు..

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లపై వేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలు అయింది. విభజన చట్టం నిబంధనలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

  • 'రచన'కు అండగా రామన్న.. కేటీఆర్ ఎమోషనల్

ఎంతో మంది చదువులో మంచి ప్రతిభ కనబరిచి.. ఉన్నత స్థానాలను అధిరోహించి.. జీవితంలో హుందాగా బతకాలని కలలు కంటుంటారు. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ముందుకు వెళ్లనీయవు. వారి కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మంత్రి కేటీఆర్ అలాంటి వారికి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా ఓ విద్యార్థిని కేటీఆర్ నుంచి సాయం పొంది నాలుగు ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఆ యువతి ఇవాళ ప్రగతిభవన్​లో కేటీఆర్​ను కలిశారు.

  • భాజపా గూటికి కెప్టెన్​ అమరీందర్​ సింగ్..

పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ భాజపా కండువా కప్పుకున్నారు. తాను స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా భాజపాలో విలీనం చేశారు.

  • బైక్ లిఫ్ట్ అడిగాడు.. ఆపగానే ఇంజిక్షన్ ఇచ్చి చంపేశాడు

Man killed a biker in Khammam : రోడ్డు మీద ఎవరైనా లిఫ్ట్ అడిగితే మానవత్వంతో మనం అటువైపే పోతున్నామని ఆపి ఎక్కించుకుంటాం. అలాగే ఖమ్మం జిల్లాలో ఓ గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడగగానే ద్విచక్రవాహనదారుడు ఆపి అతడిని బైక్ ఎక్కించుకున్నాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ దుండగుడు చేసిన పనికి ఏకంగా ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

  • ఎమ్మెల్యే గోపీనాథ్​ పీఏ వీరంగం.. వివాహిత గొంతుకోసి..!

MLA Gopinath PA attacked a woman : జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ పీఏ ఓ వివాహితపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతుకోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • కోర్టులో నలుగురిని హాజరుపర్చిన ఎన్ఐఏ అధికారులు

ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో నిఘా పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న నలుగురిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దేశవ్యాప్తంగా పీఎఫ్​ఐ ఉగ్ర సంబంధ శిక్షణా కార్యక్రమాలకు పాల్పడిన మరో 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పలు కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు, కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు.

  • రాగల 3 రోజులు భారీ వర్షాలున్నాయ్​..!

Telangana Weather Report: వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

  • మద్యం మత్తులో సీఎం.. కనీసం నడవ లేక..'

Punjab CM deplaned: మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్​ను విమానం నుంచి దించేశారని ఆరోపించారు శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్ బాదల్. శనివారం మాన్​తోపాటు జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు.

  • బ్రిటన్ రాణికి తుది వీడ్కోలు..

రాచరిక సంప్రదాయాలతో బ్రిటన్ రాణి అంత్యక్రియలు ముగిశాయి. వివిధ దేశాధినేతలు, రాజులు, రాణి కుటుంబీకులు క్వీన్ ఎలిజబెత్​-2కు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించారు.

  • ఈ వారం విడుదలయ్యే సినిమాలివే

దసరా పండగకు పెద్ద చిత్రాలన్నీ విడుదల ఉండటం వల్ల.. చిన్న సినిమాలన్నీ ఒక వారం ముందుగానే ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో కొన్ని చిత్రాలు/సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. అవేంటో చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.