ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్ 9pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Aug 22, 2022, 8:57 PM IST

Telangana News Today టాప్​న్యూస్ 9pm
Telangana News Today టాప్​న్యూస్ 9pm
  • ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేసీఆర్‌

దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసే కుటిల ప్రయత్నాలను చూస్తూ మేథావులు మౌనం వహించరాదని సీఎం కేసీఆర్‌ సూచించారు. దేశం సరైన రీతిలో పురోగమించేలా సక్రమరీతిలో ప్రయాణించేలా వైతాళికులు కరదీపికలుగా మారాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

  • అమిత్ షా అబద్ధాలకు బాద్‌షా అంటూ కేటీఆర్ ఫైర్

KTR Comments on Amit Shah Speech వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి భాజపా ఖరీదు కడుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. అమిత్‌షా అబద్ధాలకు బాద్‌షా అని ఆయన ప్రసంగంలో అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలు లేవని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ రాజకీయ వ్యాపారుల ముందు తాకట్టు పెట్టిన గల్లీ నాయకులను చరిత్ర క్షమించదన్నారు.

  • మీ వాట్సాప్ చాటింగ్​లను ప్రభుత్వం చదువుతోందా, ఇదిగో క్లారిటీ

వాట్సాప్‌లో వాట్సాప్​పైనే నకిలీ వార్త చక్కర్లు కొట్టింది. చాటింగ్​లను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందంటూ నకిలీ వార్త సృష్టించారు. ఈ ఘటనపై ప్రభుత్వ విభాగాలు స్పందించాయి.

  • భారతరత్నకు అర్హుడైన సిసోదియాపై సీబీఐ దాడులు సిగ్గుచేటు కాదా

70 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ చేయలేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి అద్భుతం సృష్టించిన వ్యక్తిపై సీబీఐ దాడులు సిగ్గుచేటు కాదా అని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. భారతరత్నకు అర్హుడైన వ్యక్తిపై ఇలాండి దాడులు ఏంటని నిలదీశారు. సిసోదియాను అరెస్ట్ చేయోచ్చని, తనను కూడా ఎప్పుడైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

  • అటవీ కళాశాలల్లో ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్

TSPSC notification టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగు జిల్లాలోని అటవీ కళాశాలల్లో ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలల్లో 27 ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎఎస్సీ నోటిఫికేషన్​లో తెలిపింది.

  • 119 ఏళ్ల వృద్ధుడి అంతిమయాత్రలో డీజే, ఉత్సాహంగా డ్యాన్సులు

119 ఏళ్ల వృద్ధుడి అంతిమ యాత్రలో డీజే ఏర్పాటు చేశారు ఆయన కుటుంబసభ్యులు. ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు​ చేస్తూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే

  • భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

Traffic Jam in Hyderabad హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సభ జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాదారులు ట్రాఫిక్​లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • జూనియర్ ఎన్టీఆర్​ భేటీపై కిషన్​ రెడ్డి క్లారిటీ

kishan reddy clarity on junior NTR meet కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్​తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే

  • ఐఏసీ విక్రాంత్ ప్రత్యేకతలు ఇవే

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహకనౌక ఐఏసీ విక్రాంత్​ను వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీంతో హిందూ మహాసముద్రంలో భారత్​కు రక్షణ పరంగా మరింత పట్టు పెరగనుంది. ఐఏసీ విక్రాంత్​ ప్రత్యేకతలు ఏంటంటే.

  • స్టార్ దర్శకుడికి ఆరు నెలల జైలు శిక్ష

Lingusamy cheque bounce case: తమిళ దర్శకుడు లింగుస్వామికి న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది. చెక్​బౌన్స్​ కేసులో ఆయనకు ఓ స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.