ఏం చేద్దాం..?
కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలు తీరుపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ సమీక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో సీజనల్ వ్యాధులపై ఏమి చర్చిస్తున్నారంటే?
ఆ బాధ్యత మీదే
పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. మాసబ్ ట్యాంక్ పశుసంవర్ధక శాఖ సంచాలకులు కార్యాలయంలో జరిగిన ఈ భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
57 రోజుల తర్వాత
57 రోజులు తర్వాత హైదరాబాద్‌లోని ఆటోమొబైల్ దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ వల్ల మార్చి 22 నుంచి మూతపడిన దుకాణాలు... ప్రభుత్వ మినహాయింపులతో ఇవాళ క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి.
6 రోజుల్లో 200 కోట్లు
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారభించిన ఆ శాఖ కోట్లలో ఆదాయాలను అర్జిస్తుంది. ఇంతకీ ఆ శాఖ, వాటి వివరాలపై మీరు ఓ లుక్కెయ్యండి.
ఎర్రని మంటలే.. చితి మంటలై
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని రెండు రంగుల దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారంటే...
వలస కార్మికులతో ఘర్షణ
అహ్మదాబాద్‌లో వలసకూలీలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అసలు గొడవేంటి?
'30 మిలియన్ వ్యాక్సిన్ డోస్‌లు'
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ, వాణిజ్యం కోసం ప్రభుత్వ సహకారంతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో గ్లోబల్ లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. టీకా విజయవంతమైతే అప్పటికి 30 మిలియన్ల డోస్‌లు అందుతాయని బ్రిటన్ తెలిపింది. ఆ వివరాలు..
రక్షణ రంగ షేర్ల దూకుడు
ఓవైపు దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోతున్న తరుణంలో రక్షణ రంగానికి చెందిన షేర్లు 10 శాతం మేర వృద్ధి చెందాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సవరించడమే కారణమా?
ఉన్నవి చాలవా?
శ్రీలంకలో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని ఆ దేశ ప్రభుత్వ ప్రతిపాదించింది. దీనిని మాజీ క్రికెటర్ జయవర్ధనే తప్పుబట్టాడు. స్టేడియం నిర్మాణంపై ఏమన్నాడంటే...
నిశ్శబ్దంగా థియేటర్లలో
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ వార్తలపై చిత్ర నిర్మాత కోన వెంకట్ స్పందించారు. తెలుసుకోవాలంటే నిశ్శబ్దంగా చదివేయండి...