ETV Bharat / state

రేపే నీట్ 2020‌ పరీక్ష.. ఫాలో కావలసిన రూల్స్ ఇవే ! - నీట్ పరీక్ష-2020

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఆదివారం జరిగే నీట్‌ పరీక్షకు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు పరీక్ష జరగనుంది. కరోనావ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులు భౌతికదూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను 2,546 నుంచి 3,834కు పెంచిన టెస్టింగ్‌ ఏజెన్సీ.. ఒక్కో గదిలో విద్యార్థుల సంఖ్యను 24 నుంచి 12కు తగ్గించింది.

Tomorrow Conducted Neet Exam in National wide
రేపే నీట్ 2020‌ పరీక్ష.. పరీక్షలో ఫాలో కావలసిన రూల్స్ ఇవే !
author img

By

Published : Sep 12, 2020, 10:33 PM IST

Updated : Sep 12, 2020, 10:53 PM IST

వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఆదివారం జరగనుంది. కరోనా పరిస్థితుల వల్ల గతంలో వాయిదా పడిన పరీక్షను నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 15 లక్షల 97 వేలు.. రాష్ట్రంలో 55,810 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మాస్కులను అనుమతించాలని నిర్ణయించిన జాతీయ పరీక్షల సంస్థ.. బూట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని ఆభరణాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

గదికి 12మంది మాత్రమే..

ఈ ఏడాది కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన నీట్.. మళ్లీ వాయిదా పడుతుందా.. కొనసాగుతుందా అనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. కొవిడ్ నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లు ఎన్​టీఏ వెల్లడించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 2,546 పరీక్ష కేంద్రాలు ఉండగా.. భౌతిక దూరం పాటించేందుకు.. ఈసారి 3,840 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక గదిలో గతంలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. ఈ ఏడాది 12 మంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకొంది.

మాస్కు తప్పనిసరి...

రాష్ట్రంలో గత ఏడాది 54,730 మంది కోసం 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది 55,810 మంది అభ్యర్థుల కోసం 112 కేంద్రాలను సిద్ధం చేసింది. విద్యార్థులు కచ్చితంగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. చేతి గ్లౌజ్​లు, పేస్​షీల్డ్ కూడా అనుమతిస్తామని పేర్కొంది. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాట్లను చేసింది. అక్టోబర్​లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది.

ఇవీచూడండి: మెయిన్స్​లో మెరిసిన యశశ్చంద్ర.. ముంబయి ఐఐటీలో సీటే లక్ష్యం

Last Updated : Sep 12, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.