ETV Bharat / state

రేపు ఏపీ ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు ఆదేశాలు

సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం ఉదయం 11గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ సమావేశం కానుంది. ఈ సమీక్షకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకావాలని ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

author img

By

Published : Jan 26, 2021, 5:06 PM IST

tomorrow-ap-sec-to-hold-video-conference-with-district-collectors-and-sps
రేపు ఏపీ ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్​దాస్​, డీజీపీ గౌతం సవాంగ్​తో పాటు పలువురు ఏపీ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ఏపీ స్థానిక ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్లు, ఓటర్ల జాబితా రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్చించనున్నారు. ఈ సమీక్షకు హాజరుకావాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: సుప్రీం తీర్పు వైకాపా ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.