Tomato Price Hyderabad : రైతులు పండించిన టమాటాకు గిట్టుబాటు ధరల్లేక.. పొలాల్లోనే వదిలేసి, రోడ్లపై పారేసిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ మొన్నటి దాకా ఆ టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో.. మార్కెట్లో చూద్దామన్నా అవి కనిపించలేదు. కిలో రూ.150లకు ఎగబాకిన టమాటాలను.. మధ్యతరగతి కుటుంబాలు కొనలేక ఎన్నో అవస్థలు పడ్డారు.
Tomato Price Today Hyderabad : ఉల్లిపాయ లేకుండా కూర ఎంత కష్టమో.. టమాటా లేకున్నా కూడా అంతే కష్టం. కూరలో టమాటా వేస్తే ఇద్దరికి సరిపోయేది నలుగురికి సరిపోతుంది. అందుకే వినియోగదారులు మార్కెట్‌కు వచ్చినప్పుడల్లా కచ్చితంగా రెండు మూడు కేజీల చొప్పున టమాటాలు (Tomato Price Today Telangana) విక్రయిస్తారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు కిలో కాదు.. పావుకిలో టమాటా కొనాలంటే జంకే పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లలో కిలో టమాటా వంద దాటేసింది. కాస్త బాగున్న టమాటా అయితే.. నూట పది నుంచి నూట ఇరవై దాకా పలుకుతోంది.
Tomato Theft in Sangareddy : ధరలోనే కాదు.. దొంగతనాల్లోనూ.. 'టమాట' హల్చల్!
Reduced Tomato Prices : టమాటాతో పాటుగా ఇతర కాయగూరలు మేమేం తక్కువా అన్నట్లుగా అవి కూడా ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధర పెరగడం వల్ల వినియోగం తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రానికి సరఫరా జరగట్లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మహానగరానికి టమాటా రాక పెరుగుతోంది. రైతుబజారులో కిలో టమాటా (Tomato Price Decreased in Telangana) రూ.63లు ఉంటే.. బయట మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.140 వరకు అమ్ముతున్నారు. నగరానికి 10 రోజుల కిందట కేవలం 850 క్వింటాళ్ల సరకు రాగా.. సోమవారం 2450 క్వింటాళ్లు హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చింది. ఎక్కువగా చిత్తూరు, కర్ణాటక, అనంతపురం నుంచి హైదరాబాద్‌కి దిగుబడి వస్తోంది. దీనికి తోడు రంగారెడ్డి, చేవేళ్ల, నవాబ్‌పేట, మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటా ఎక్కువ మెత్తంలో రావడమే ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు కిలో రూ.50లోపు దొరికే అవకాశం ఉంటుందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు.
Tomato Prices More High : టమాట రికార్డుల మీద రికార్డులు.. భైంసాలో కిలో@200
వ్యాపారుల మాయాజాలం : నగరానికి వస్తున్న టమాటా దిగుబడి మేరకు హోల్‌సేల్ మార్కెట్లో డిమాండ్ ఆధారంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ధరలను నిర్ణయిస్తారు. అదేవిధంగా నాణ్యతను బట్టి మొదటి, రెండో రకంగా విభజించి ధర నిర్ణయించి రైతుబజార్లలో ఆ ప్రకారమే విక్రయించాలని ఆదేశిస్తారు. కానీ వ్యాపారులు మాత్రం అన్ని రకాలకు ఒకేరకంగా ధర వసూలు చేస్తున్నారు. మొదటి రకం ధరల పట్టిక మాత్రంమే మార్కెట్లో ప్రదర్శిస్తారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కిలో మొదటి రకం టమాటా రూ.63గా నిర్ధారించి బోర్డులు రైతుబజార్లలో పెట్టినా అక్కడ శాశ్వత దుకాణదారులు కిలో రూ.100కు తగ్గకుండా విక్రయిస్తున్నారు. ఎస్టేట్ అధికారికి ఫిర్యాదు చేసినా.. ఏ మాత్రం ప్రయోజనం లేదని మెహిదీపట్నం రైతుబాజరుకు (Tomato Price in Hyderabad Rythu Bazar) వెళ్లిన ప్రమోదరావు వాపోయారు.
Tomato Price Record: ఆపిల్ దిగదుడుపే..! హోల్‌సేల్ మార్కెట్లో ఆల్‌టైమ్ హిట్ కొట్టేసిన టమాటా ధర