Formula E racing in Hyderabad : ఇండియాలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ ఈవెంట్ జరగనుంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్‌పై ఈవెంట్ జరగనుంది. ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
ఈవెంట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈఓ దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉంటారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎక్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎక్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
mahesh babu reaction Formula E racing : ఫార్ములా ఈ రేసింగ్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఇండియాలో మొదటి సారిగా జరుగుతున్న ఫార్మూలా ఈ రేసింగ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఓ గొప్ప విషయం. ఓ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన కేటీఆర్‌కు, అనిల్ చలమలశెట్టికి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 11న జరుగునున్న ఈ రేసు పోటీలను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అని మహేశ్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
Let's race against climate change! Congratulations @KTRTRS garu, @TelanganaCMO, & Anil Chalamalasetty garu on bringing #FormulaE to Hyderabad! Looking forward to #GreenkoHyderabadEPrix on Feb 11th!@HMDA_Gov @AceNxtGen pic.twitter.com/Lwf1I9T8Cp
— Mahesh Babu (@urstrulyMahesh) January 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Let's race against climate change! Congratulations @KTRTRS garu, @TelanganaCMO, & Anil Chalamalasetty garu on bringing #FormulaE to Hyderabad! Looking forward to #GreenkoHyderabadEPrix on Feb 11th!@HMDA_Gov @AceNxtGen pic.twitter.com/Lwf1I9T8Cp
— Mahesh Babu (@urstrulyMahesh) January 24, 2023Let's race against climate change! Congratulations @KTRTRS garu, @TelanganaCMO, & Anil Chalamalasetty garu on bringing #FormulaE to Hyderabad! Looking forward to #GreenkoHyderabadEPrix on Feb 11th!@HMDA_Gov @AceNxtGen pic.twitter.com/Lwf1I9T8Cp
— Mahesh Babu (@urstrulyMahesh) January 24, 2023
Adivi sesh reaction Formula E racing : ఫార్ములా ఈ-రేస్‌పై టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కూడా స్పందించారు. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌కు ఈ ఘనత తీసుకొస్తున్న మంత్రి కేటీఆర్, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టి, తెలంగాణ ప్రభుత్వానికి శేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ ఈవెంట్‌లో తాను తప్పక పాల్గొంటానని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
-
I am now counting down the days to the first-ever #FormulaE World Championship in #India. See you at the #GreenkoHyderabadEPrix on February 11. Thank you @ktrtrs @telanganacmo @HMDA_Gov and Anil Chalamalasetty for paving a #Sustainable and #Decarbonised future.@AceNxtGen pic.twitter.com/G6XgocObC6
— Adivi Sesh (@AdiviSesh) January 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am now counting down the days to the first-ever #FormulaE World Championship in #India. See you at the #GreenkoHyderabadEPrix on February 11. Thank you @ktrtrs @telanganacmo @HMDA_Gov and Anil Chalamalasetty for paving a #Sustainable and #Decarbonised future.@AceNxtGen pic.twitter.com/G6XgocObC6
— Adivi Sesh (@AdiviSesh) January 24, 2023I am now counting down the days to the first-ever #FormulaE World Championship in #India. See you at the #GreenkoHyderabadEPrix on February 11. Thank you @ktrtrs @telanganacmo @HMDA_Gov and Anil Chalamalasetty for paving a #Sustainable and #Decarbonised future.@AceNxtGen pic.twitter.com/G6XgocObC6
— Adivi Sesh (@AdiviSesh) January 24, 2023