ETV Bharat / state

Tollywood Drugs Case Updates : టాలీవుడ్ ప్రముఖుల్లో 'డ్రగ్స్‌' దడ.. ఎప్పుడు ఎవరి పేరు తెరపైకొస్తుందోనని టెన్షన్‌.. టెన్షన్‌..

Tollywood Drugs Case Updates : భాగ్యనగరంలో ఒక్కొక్కటిగా బయటపడుతోన్న డ్రగ్స్‌ లింకులతో.. తెలుగు చిత్ర పరిశ్రమ ఉలికిపడుతోంది. ఏ క్షణంలో ఎవరి పేరు బయటకు వస్తుందో అని పలువురు ఆందోళన చెందుతున్నారు. టీఎస్‌ న్యాబ్‌, గుడి మల్కాపూర్‌ పోలీసుల ఆపరేషన్‌లో గత నెల 31న మాదాపూర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో మత్తు దందా బయటపడింది. ఆ కేసులో అరెస్టైన ప్రధాన నిందితులు వెంకటరత్నారెడ్డి, బాలాజీ, మురళి ఇచ్చిన సమాచారంతో గురువారం మరో 8 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Madhapur Drugs Case Updates
Tollywood Drugs Case Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 11:51 AM IST

Tollywood Drugs Case Updates : మాదాపూర్ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మెహిదీపట్నం బస్‌స్టాప్‌ వద్ద ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకునే సమయంలో ఎండీఎంఏ, ఎక్సటసీ పిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన సమాచారంతో సినీ నటుడు నవదీప్‌కు డ్రగ్స్‌ ముఠాలతో సంబంధాలున్నట్టు గుర్తించారు. వీరంతా ఓ జట్టుగా ఏర్పడి.. నగరంలో తరచూ డ్రగ్స్‌ పార్టీలు నిర్వహించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన రామ్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొని.. హైదరాబాద్‌లోని పలు చోట్ల రేవ్‌పార్టీలు నిర్వహించినట్టు ఆధారాలున్నట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Actor Navdeep Drug Case Update : తాజాగా పట్టుబడిన నిందితుల్లో నలుగురు సినీ నిర్మాతలు, ఒక నటుడు, ఇద్దరు మోడల్స్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సినీ నటుడు నవదీప్‌ న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 19 వరకు నవదీప్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవదీప్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా వేస్తూ.. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను అదేశించింది.

Hyderabad Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసులో 'వెంకట్​ లీలలు'.. అమ్మాయిలకు సినీ ఎర.. రేవ్ పార్టీల్లో ప్రముఖులకు వల

మరోవైపు మిగిలిన నిందితులంతా సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. అంతర్జాలం, సామాజిక మాధ్యమాల నుంచి వైదొలిగారు. తమ ఆనవాళ్లు దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఏపీ, తెలంగాణకు చెందిన వీరిని గుర్తించి.. నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. సినీ నిర్మాత ఉప్పలపాటి రవి విశాఖపట్టణంలో చివరగా సెల్‌ఫోన్‌ వాడినట్లు సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించినట్టు సమాచారం.

Madhapur Drugs Case Updates : వినోదం మాటున కొన్ని పబ్‌ల నిర్వాహకులు మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలడంతో పలుమార్లు పోలీసులు హెచ్చరించారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల నిర్వాహకులు కల్హర్‌రెడ్డి, అర్జున్, సూర్య వారాంతంలో రేవ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తించారు. శ్వేత, కార్తీక్‌ తదితరులు వీరికి సహాయకులుగా ఉన్నట్టు ఆధారాలు బయటపడ్డాయి. జూబ్లీహిల్స్‌లోని పబ్‌పై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు నెలల పాటు పబ్‌ను సీజ్‌ చేశారు. అనంతరం రాజకీయ పలుకుబడితో పబ్‌ తెరచి.. యథేచ్ఛగా మత్తు దందా సాగిస్తున్నారు. డ్రగ్స్‌ వినియోగం మాత్రమే జరిగే పబ్‌లు.. ప్రస్తుతం మత్తు పదార్థాల సరఫరాకు అడ్డాగా మారటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రముఖుల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. : ప్రస్తుతం అరెస్టయిన నిందితుల సెల్‌ఫోన్లలోని కాల్‌డేటా, వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో జరిగిన లావాదేవీలను గుర్తించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. నిందితులు తొలగించిన సమాచారం తిరిగి బయటకు తీసేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. అక్కడ బయటపడే సమాచారం ఆధారంగా ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయనేది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సినీ నిర్మాతలు, మోడల్స్, పబ్‌ల నిర్వాహకులతో సన్నిహితంగా మెలిగే వారినీ పోలీసులు ప్రశ్నించే అవకాశాలున్నట్టు సమాచారం.

Madhapur Drug Case Update : 'డ్రగ్స్' వినియోగంపై బేబీ సినిమా నిర్మాతకు నోటీసులు.. స్పందించిన డైరెక్టర్ సాయి రాజేశ్‌

Tollywood Drugs Case Update : టాలీవుడ్‌లో మరోసారి మత్తు కలకలం!.. నిందితుల్లో సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.