ETV Bharat / state

Cyber Financial Crimes: 'ఆన్​లైన్​లో డబ్బులు పోయాయా? అయితే 24 గంటల్లో కాల్​ చేయండి'

Toll Free Number For Cyber Financial Crimes: ఇప్పటివరకు సైబర్​ మోసగాళ్ల చేతిలో పడి డబ్బు పోగొట్టుకుంటే అది రికవరీ అవుతుందన్న గ్యారింటీ లేదు. కానీ ఆ సొమ్మును రికవరీ చేసే వీలు కల్పించారు సైబర్​ క్రైమ్ పోలీసులు. మోసం జరిగిన 24 గంటల్లో 155620 టోల్​ ఫ్రీ నంబర్​కు కాల్​ చేయాలని సూచిస్తున్నారు.

Cyber Financial Crimes, cyber crimes
సైబర్ క్రైమ్ వార్తలు
author img

By

Published : Dec 13, 2021, 8:54 AM IST

Toll Free Number For Cyber Financial Crimes: ఒక్క టోల్‌ ఫ్రీ నంబరు నెల రోజుల్లో రూ.34లక్షలు రికవరీ చేసింది. సైబర్‌ ఆర్థిక నేరాల్లో సొమ్ము పోగొట్టుకున్న పాతిక మందికి డబ్బు తిరిగొచ్చేలా చేసింది. మెగా లోక్‌ అదాలత్‌లో భాగంగా రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల చొరవతో బాధితులకు ఊరట లభించింది. ఆన్‌లైన్‌లో జరిగే కస్టమర్‌కేర్‌, ఉద్యోగ మోసాలు, ఫిషింగ్‌ కాల్స్‌, ఓటీపీ షేరింగ్‌, హనీట్రాప్స్‌, గిఫ్ట్‌ ఫ్రాడ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలకు సంబంధించి 24 గంటల్లోపు 155620 టోల్‌ఫ్రీ నంబరు ద్వారా ఫిర్యాదు చేస్తే బాధితుడి ఖాతా నుంచి పలు ఖాతాల్లోకి చేరిన సొమ్ము అక్కడే ఫ్రీజ్‌ అవుతుంది. ఆ సొమ్మును రికవరీ చేసే వీలు కలుగుతుంది.

ఇలా గత నెల రోజుల్లో పలువురు నిందితుల నుంచి రికవరీ చేసిన రూ.34,27000 సొత్తును తాజా మెగా లోక్‌ అదాలత్‌లో బాధితులకు అందజేశారు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు. గత రెండు నెలల్లో 50 కేసులను పరిష్కరించి రూ.68లక్షలు స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు.

ఇదీ చూడండి: Cyber Crime Today in Mahabubabad: ఒక్క క్లిక్​తో.. రూ.2 లక్షలు ఖల్లాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.