Weather in TS: రాష్ట్రంలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఈ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస్తాయని పేర్కొంది.
సోమవారం ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీశ్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిమీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవీ చదవండి:
BASARA RGUKT: వర్షంలోనూ కొనసాగుతున్న ఆందోళన.. అప్పటివరకు తగ్గేదేలే...