జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. గడువు దగ్గర పడుతుండటంతో పార్టీల అభ్యర్థుల ప్రకటన జోరందుకుంది. మొత్తం 150 వార్డులకు గాను ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల గడువు పూర్తికానుంది. ఈసారి నామినేషన్లకు మూడు రోజులే గడువు ఇవ్వడం వల్ల విడతల వారీగా వెలువడుతున్న జాబితాలో టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు పార్టీ ముఖ్యనేతలతో కలిసి నామపత్రాలు సమర్పిస్తున్నారు. మరోవైపు నామినేషన్లకు ఈరోజే ఆఖరు కావడం వల్ల టికెట్ ఆశిస్తున్న నేతలు అవకాశం వస్తుందా? రాదా? అనే ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే మరో పార్టీలోకి జంప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు.
గురువారం మంచి ముహూర్తం కావడం వల్ల భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 522 మంది అభ్యర్థులు మొత్తం 580 నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం వచ్చిన నామినేషన్లతో కలుపుకొని ఇప్పటివరకు 537 మంది మొత్తం 597 నామినేషన్లు దాఖలు చేశారు.
ఇదీ చదవండి: నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు.. ఏర్పాట్లు పూర్తి