ఏపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బంహరి పార్థివదేహానికి విశాఖలో నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకూ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన ఆయన.. కొవిడ్ మహమ్మారితో మృతిచెందారు. ఇటీవల ఉన్నట్టుండి ఆస్పత్రిపాలైన ఆయన.. తిరిగి ఇంటికి రాకుండానే కన్నుమూశారు.
మూడున్నర దశాబ్దాలుగా విశాఖ జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, విలక్షణ నేతగా సబ్బం హరి పేరు తెచ్చుకున్నారు. సబ్బం హరి మృతి పట్ల ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కరోనా తీవ్రంగా ఉంది.. లాక్ డౌన్ విధించాలి: చంద్రబాబు