ETV Bharat / state

TSPSC paper leakage case : టీఎస్‌పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో మరో నలుగురు అరెస్టు - Telangana Latest News SIT Police

TSPSC paper leakage case
TSPSC paper leakage case
author img

By

Published : May 9, 2023, 5:25 PM IST

Updated : May 9, 2023, 7:33 PM IST

17:19 May 09

TSPSC paper leakage case : టీఎస్‌పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో మరో నలుగురు అరెస్టు

TSPSC paper leakage case update : టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు కూడా ఏఈ, ఏఈఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. మొత్తం ఈ కేసులో అరెస్టుల సంఖ్య 27కు చేరింది. ఈ నలుగురు నిందితులు కూడా ప్రవీణ్, డాక్యా నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్​లను రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు.

దీంతో సిట్ అధికారులు సాంకేతికతను ఆధారంగా చేసుకొని దర్యాప్తు నిర్వహించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో పాటు, నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు. అనుమానాస్పద లావాదేవీతో పాటు గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిందితులు చేసిన ఫోన్ కాల్స్​ను పరిశీలించారు. ఇందులో భాగంగా అనుమానాస్పద ఫోన్ కాల్స్ వివరాలు సేకరించి దర్యాప్తు చేశారు. సదరు వ్యక్తులను పిలిచి ప్రశ్నించడంతో అసలు విషయాలు బయటికి వస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకు పోలీసులు డివిజినల్ అకౌంట్స్ అధికారి ప్రశ్నాపత్రం లీకైనట్లు తేల్చారు.

ఏఈఈ ప్రశ్నాపత్రం సైతం మురళీధర్ రెడ్డి, మనోజ్‌లు కొనుగోలు చేసినట్లు కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల ద్వారా గుర్తించారు. ఈరోజు అరెస్ట్ చేసిన నలుగురు సైతం ప్రశ్నాపత్రాల కోసం ప్రవీణ్, డాక్యానాయక్‌లకు డబ్బులు చెల్లించినట్లు సిట్ అధికారులు తేల్చారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సరైన ఆధారాలు లభిస్తే వాళ్లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

Sharmila On TSPSC Paper Leak : 'సిట్​ దర్యాప్తు స్క్రిప్ట్ మొత్తం ప్రగతిభవన్ నుంచే'

TSPSC Case: కుటుంబ సభ్యుల కోసమే అడ్డదారిలో ప్రశ్నాపత్రాల కొనుగోలు

TSPSC paper leak case: నోరు విప్పని నిందితులు.. రూట్ మార్చిన సిట్ అధికారులు

Last Updated : May 9, 2023, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.