ETV Bharat / state

వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది : హరీశ్​రావు - హరీశ్​రావు కామెంట్స్​ ఆన్​ రేవంత్ రెడ్డి

Today BRS Joinings at Telangana Bhavan : రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తే ఐటీ రంగంలో నష్టపోతామని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్​ నాయకులు అన్నింటికీ కర్ణాటక వైపే చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వడ్లు సమృద్ధిగా పండుతున్నాయని.. ఛత్తీస్‌గఢ్‌ వడ్ల నమూనా మనకు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ములుగు జిల్లా నాయకులు ఆయన సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు.

Harish Rao Comments on Revanth Reddy
Mulugu Leaders Join in BRS Party Today
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 2:26 PM IST

Updated : Nov 12, 2023, 2:48 PM IST

Today BRS Joinings at Telangana Bhavan : కర్ణాటకలో ఎటు చూసినా కరవే కనిపిస్తోందని.. కేసీఆర్​ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా కరవే లేదని మంత్రి హరీశ్​రావు తెలిపారు. ములుగు జిల్లాలోని స్థానిక నాయకులు హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో హరీశ్​రావు(Harish Rao) సమక్షంలో బీఆర్​ఎస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లా బీఆర్​ఎస్​ అభ్యర్థి నాగజ్యోతిని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. బీఆర్​ఎస్(BRS)​ ఎమ్మెల్యే లేకుండా ములుగు జిల్లాను అభివృద్ధి చేశామని తెలిపారు. కమలాపూర్​ ప్యాక్టరీని తెరిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేశారని గుర్తు చేశారు.

Harish Rao comments on Karnataka Congress : ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయని హరీశ్​రావు అన్నారు. ఎకరానికి సుమారు 25-30 క్వింటాల్​ వరి పండుతుందని.. ప్రతి గింజను కేసీఆర్(KCR) ప్రభుత్వం కొంటుందని పేర్కొన్నారు. ఛత్తీస్​ఘఢ్​లో 13 క్వింటాల్​ మాత్రమే కొంటున్నారని.. దీన్ని కాంగ్రెస్ మోడల్​గా ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటివరకు రైతుల ఖాతాలో రూ.72 వేల కోట్లు జమ చేశామని అన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకులు అవసరమని.. ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దశం చేశారు. ఇటీవల కాలం వస్తున్న అన్ని ఎన్నికల సర్వేల్లో బీఆర్​ఎస్​ గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఈసారి ములుగులో బీఆర్ఎస్​ జెండా ఎగరడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.

అధికారంలోకి వస్తే గిరిజన బంధు, పోడు భూముల పట్టాలు ఇస్తాం : హరీశ్​రావు

Harish Rao Comments on Revanth Reddy : కర్ణాటక రాష్ట్రంలో 5 గంటలు మాత్రమే కరెంట్​ ఇస్తుందని.. దీన్నే రాష్ట్ర కాంగ్రెస్​ నాయకులు మోడల్​గా తీసుకుంటున్నారని హరీశ్​రావు అన్నారు. ప్రజలకు 24 గంటలు కరెంట్ కావాలో.. కర్ణాటక మోడల్​ కావాలో తేేల్చుకోవాలని సూచించారు. కర్ణాటక కాంగ్రెస్(KARNATAKA CONGRESS)​ నాయకుల చెప్పిన విధంగానే ఇక్కడ ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలిస్తే నీళ్లు, నిధులు, నియామకాల్లో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్​ నాయకులు తెలంగాణ గురించి ఆలోచించరని.. కర్ణాటక గురించే ఆలోచిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయంపై కనీసం అవగాహన లేకుండా రేవంత్​ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతున్నారని ఆరోపించారు.

"ములుగులో బీఆర్​ఎస్​ జెండా ఎగరడం ఖాయం. ఈ రాష్ట్రం మేలు గురించి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆలోచిస్తారా? ఇక్కడి కాంగ్రెస్ నేతలు అన్నింటికీ కర్ణాటక వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఐటీ రంగంలోనూ మనం నష్టపోతాం. రైతుబంధు సాయం ఆపాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. రాష్ట్రానికి దశ, దిశ అందించిన నాయకుడు.. కేసీఆర్‌."- హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది : హరీశ్​రావు

సమైక్యవాది పవన్‌ కల్యాణ్‌తో ఈటల రాజేందర్‌ ఎలా కలుస్తారు : మంత్రి హరీశ్​రావు

'సీఎం కేసీఆర్ ఏ పథకం పెట్టినా మహిళల పేరుతోనే - వారికే పెద్ద పీట'

Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్​రావు ఫైర్

Last Updated : Nov 12, 2023, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.