సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సోమేశ్‌కుమార్‌ని టీఎన్జీవో సంఘం నేతలు కోరారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎస్‌ను కలిసిన ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు విడతల కరవు భత్యం(డీఏ) మంజూరు చేయడం సహా మెడికల్ ఇన్‌వాలిడేషన్ స్కీం అమలుకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటుచేయాలన్నారు. ఈ మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ సచివాలయంలో సీఎస్‌ను కలిసి అభ్యర్ధించారు.
ఉద్యోగులకు మినహాయింపుల కోసం గతంలో మాదిరిగా రాష్ట్రస్థాయిలో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొన్నిశాఖల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంలో శాఖాధిపతుల జాప్యాన్ని నివారించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఉద్యోగ సంఘాల నేతలు అభ్యర్ధించారు. సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని సీఎస్ సోమేశ్‌కుమార్ హమీ ఇచ్చినట్లు టీఎన్జీవో నేతలు తెలిపారు.
ఇదీ చూడండి: