కొత్త సచివాలయంలో మందిరం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను ఉద్యోగసంఘాలు స్వాగతించాయి. ప్రస్తుతం ఉన్నదాని కంటే ఎక్కువ స్థలంలో మరింత గొప్పగా గుడి, మసీదులను నిర్మిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు సచివాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వచ్చిన ఉద్యోగులకు, ప్రజలకు భరోసాను, నమ్మకాన్ని కొత్త మసీదు, దేవాలయాలు కలిగిస్తాయని టీఎన్జీవో పేర్కొంది.
అందరి మనోభావాలకు అనుగుణంగా మసీదు, నల్ల పోచమ్మ దేవాలయాలను నిర్మిస్తామని చెప్పడం కేసీఆర్ గొప్పతనానికి, సెక్యులరిజానికి నిదర్శనమని అభిప్రాయపడింది. నూతన సచివాలయం నిర్మాణంతోపాటే కొత్త మసీదు, కొత్త దేవాలయం నిర్మాణం జరపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం