ETV Bharat / state

సమస్యల్ని పరిష్కరించాలని కవితకి టీఎన్జీవో నాయకుల విన్నపం - ఎమ్మెల్సీ కవితకి టీఎన్జీవో నాయకుల విన్నపం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీఎన్జీవో నాయకులు హైదరాబాద్​లోని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు తన వంతు సహకారం అందిస్తానని వారికి కవిత హామీ ఇచ్చారు.

tngo members meet mlc kavitha at her house in hyderabad
సమస్యల్ని పరిష్కరించాలని కవితకి టీఎన్జీవో నాయకుల విన్నపం
author img

By

Published : Oct 30, 2020, 7:34 PM IST

ఉద్యోగుల సమస్యల్ని సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్.. ఎమ్మెల్సీ కవితని కోరారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన కవితని టీఎన్జీవో నాయకులు హైదరాబాద్​లోని ఆమె నివాసంలో కలిశారు.

తెలంగాణ సాధనలో ఉద్యోగులు ముందున్నారని, రాష్ట్ర అభివృద్ధిలోనూ పాటుపడ్డారని కవిత కొనియాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు సహకారం ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మరింత మమేకమై పనిచేయాలి: చాడ వెంకట్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.