ETV Bharat / state

పెండింగ్‌ జీతాలు, డీఏలు ఇప్పించండి: టీఎన్జీవో నేతలు - పెండింగ్​ జీతాలు ఇప్పించాలని కోరిన టీఎన్జీవో నేతలు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావును టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. పెండింగ్‌లోని మూడు నెలల 50 శాతం జీతాలు, డీఏలను ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

పెండింగ్‌లోని జీతాలు, డీఏలు ఇప్పించండి: టీఎన్జీవో నేతలు

author img

By

Published : Sep 22, 2020, 6:12 PM IST

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావును టీఎన్జీవో నేతలు కలిశారు. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాలు, మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్‌ రావును కోరారు. నూతనంగా ఎన్నికైన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను మంత్రి అభినందించారు.

కొవిడ్ కాలంలో 3 నెలలు 50 శాతం జీతాలే ఇచ్చారని... మిగతా 50 శాతం ఈ నెలలోనే చెల్లించాలని మంత్రిని కోరారు. అలాగే మూడు నెలల డీఏను దసరా పండుగలోపు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. డీఏలు, బకాయి జీతాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

ఇదీ చదవండి: డీజీపీని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.