ETV Bharat / state

'నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే' - తెలంగాణ జన సమితి పార్టీ వార్తలు

నిరుద్యోగ భృతిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెజస ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ సదస్సులో డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.

'నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే'

author img

By

Published : Mar 7, 2020, 5:02 AM IST

'నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే'

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని... ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్​ చేశారు. హైదరాబాద్ చైతన్యపురి చౌరస్తాలోని ఓ ప్రైవేటు హాలులో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉద్యోగాలు కల్పించాలని యువత అడుగుతుందని.. ఆ బాధ్యతను ప్రభుత్వం సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఉద్యోగం పొందడానికి కావాల్సిన శిక్షణను సర్కార్​ కల్పించాలన్నారు. వారు ప్రధానంగా మూడు డిమాండ్లపై చర్చ జరిపారు.

1. నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి.

2. ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలి.

3. ప్రభుత్వ ఖాళీ పోస్టులను క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలి.

ఇవీ చూడండి: 50వేల మాస్క్​లు పంపించండి: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.