కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామని ధ్వజమెత్తారు. కొందరి స్వార్థం కోసం ప్రభుత్వం వనరులు కొల్లగొడుతోందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో సర్పంచులు నామినేషన్లు వేయడానికి వెళ్తే అక్రమంగా అరెస్టు చేశారని వెల్లడించారు. మంత్రివర్గం మొత్తం హుజూర్‌నగర్ ఉపఎన్నిక కోసం పనిచేస్తోందని అన్నారు. తెరాసకు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రాత్మక తప్పిదమని విమర్శించారు. తమ పద్దతులను పక్కన పెట్టి.. అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు కోదండరామ్ తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నేత గూడూరు నారాయణరెడ్డి కోదండరాంకు మిఠాయి తినిపించారు.
ఇదీ చూడండి: బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడిన గవర్నర్ తమిళిసై