కరోనాను అరికట్టేందుకు హైకోర్టు చేసిన సూచనలను ప్రభుత్వం అమలుచేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమస్యలను ప్రభుత్వాధినేతలను వివరించే అవకాశం లేనందున కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. కొవిడ్ విషయంలో ఇప్పటి వరకు న్యాయస్థానం చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్న కోదండరాం... ప్రజారోగ్యానికి తెలంగాణలో అతితక్కువగా ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల్లో కొవిడ్ పరీక్షా కేంద్రాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు విద్యుత్ బిల్లుల పెరుగుదల ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తేసినా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోలేదని విమర్శించారు. బిల్లు కట్టకపోతే విద్యుత్ కట్ చేస్తామని మంత్రి అనడం సరికాదన్నారు. 100 యూనిట్ల లోపు వాళ్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని కోరారు. 200 యూనిట్ల వరకు సగం బిల్లు ఇవ్వాలని సూచించారు. నాన్ టెలిస్కోపిక్ పద్ధతి రద్దుచేసి.. టెలిస్కోపిక్ విధానం అమలుచేయాలని చెప్పారు. కనీసం ఈ 4 నెలలైనా ఈ విధానం అమలుచేయాలని తెలిపారు. కరోనాతో జర్నలిస్టు మృతి తీరని లోటుని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పెరుగుదల ఆవేదనకు గురిచేస్తోంది. మూడు నెలలు కలిపి బిల్లులు తిస్తే... స్లాబులు పెరుగుతాయి. 100 యూనిట్ల లోపు వాళ్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలి. 200 యూనిట్ల వరకు సగం బిల్లు ఇవ్వాలి... కోదండరాం, తెజస అధ్యక్షుడు
ఇవీ చూడండి: లాక్‌డౌన్ ఎఫెక్ట్: బుజ్జి బొజ్జాయిలు ఎక్కువవుతున్నారు!