ఏ చట్ట ప్రకారం జీతాలు, పెన్షన్లలో కోత విధించారని కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద సమాధానం లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తప్పును కప్పి పుచ్చుకోవడానికి హడావుడిగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని మండిపడ్డారు. పెన్షనర్లు న్యాయం కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అణచివేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోదండరాం రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కావాల్సిన కోవిడ్ -19 పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించడం పట్ల.. ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కోవిడ్ పరీక్షలు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు