ETV Bharat / state

Kodandaram on TRS: 'ప్రగతిభవన్ కేంద్రంగా కాంట్రాక్టర్ల కమీషన్ దందా నడుస్తోంది' - కోదండరాం ఫైర్

Kodandaram on TRS: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రగతిభవన్‌ కేంద్రంగా కాంట్రాక్టర్ల కమిషన్ దందా నడుస్తోందని ఆరోపించారు. ఉద్యోగ ప్రకటన చేసి నెల దాటినా ఒక్క నోటిఫికేషన్ లేదని మండిపడ్డారు.

Kodandaram on TRS
కోదండరాం
author img

By

Published : Apr 23, 2022, 5:34 PM IST

Updated : Apr 23, 2022, 6:37 PM IST

Kodandaram on TRS: నోటిఫికేషన్ల విడుదలలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఉద్యోగ ప్రకటన చేసి నెల దాటినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం గెజిట్‌ అమల్లోకి వస్తే కృష్ణా జలాలపై రాష్ట్రం పూర్తిగా హక్కులు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మే 4వ తేదీ నుంచి కృష్ణా జలాల సాధన యాత్ర చేస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పెరిగిన ధరలతో పేదలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోదండరాం విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నెల 25, 26 తేదీలలో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

'ప్రగతిభవన్ కేంద్రంగా కాంట్రాక్టర్ల కమీషన్ దందా నడుస్తోంది'

ప్రగతిభవన్ కేంద్రంగా కాంట్రాక్టర్ల కమీషన్ దందా నడుస్తోంది. గుత్తేదార్లకు టోకెన్ వ్యవస్థను అమలు చేయాలి. నిధుల దుర్వినియోగం, నీళ్ల సాధనలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనపడుతోంది. మే 4 నుంచి కృష్ణా జలాల సాధన యాత్ర చేస్తాం. సాయిగణేష్ ఆత్మహత్యకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పువ్వాడ రాజీనామా చేయాలి. నోటిఫికేషన్ల విడుదలలో ప్రభుత్వం ఉద్దేశపూర్వక జాప్యం చేస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలి.

- కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు

నిధుల దుర్వినియోగం, నీళ్లను సాధించడంలో తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కోదండరాం మండిపడ్డారు. ప్రగతిభవన్ కేంద్రంగా కాంట్రాక్టర్ల కమీషన్ దందా నడుస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. గుత్తేదార్లకు టోకెన్ వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వేధింపుల వల్లే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 29న జెండా ఆవిష్కరిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: 'కేంద్రమే నిధులిస్తే.. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు?'

పిల్లల్ని బైక్​పై కూర్చొబెట్టి వెళ్లాడు.. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు

50 కేజీల నిమ్మకాయలు చోరీ.. ధర రూ.20 వేలకుపైనే.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

Last Updated : Apr 23, 2022, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.